Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ గా పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్స్ లో ఒకరు రష్మిక మండన..ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..కన్నడ సినీ పరిశ్రమలో ‘కిరిక్ పార్టీ’ అనే సినిమా ద్వారా కెరీర్ ని ప్రారంభించిన ఈ అమ్మాయికి తొలి సినిమాతోనే భారీ హిట్ ని అందుకుంది..అందం తో పాటు అభినయంలో కూడా ఈమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది..ఆ తర్వాత కన్నడ లో ఏకంగా పునీత్ రాజ్ కుమార్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

అలా అంచలంచలుగా ఎదుగుతున్న ఈమెకి తెలుగు ప్రేక్షకులకు చలో అనే సినిమా ద్వారా పరిచయం అయ్యింది..ఈ సినిమా సూపర్ హిట్ సాధించడం తో ఇక రష్మిక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..ఈ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ ఎక్కువ శాతం సూపర్ హిట్ అయ్యాయి..ఇక గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సంపాదించింది.
ప్రస్తుతం రష్మిక కి ఉన్నంత డిమాండ్ సౌత్ లో మరో స్టార్ హీరోయిన్ కి లేదనే చెప్పాలి..ఒక్కో సినిమాకి ఈమె రెండు కోట్ల రూపాయిల వరుకు పారితోషికం తీసుకుంటుంది..ఆ రేంజ్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఈమె జీవితం కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదురుకుందట..ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన చిన్నతనం లో పడిన కష్టాలను చెప్పుకుంటూ బాగా ఎమోషనల్ అయిపోయింది రష్మిక.

ఆమె మాట్లాడుతూ ‘మేము చాలా మధ్య తరగతి కుటుంబం కి చెందిన వాళ్ళం..నా బాల్యం మొత్తం ఆర్ధిక ఇబ్బందులతోనే గడిచిపోయింది..మా నాన్న గారు మా ఇంటిని పోషించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు..ఇంటి అద్దె కూడా కట్టలేక రెండు నెలలకు ఒక ఇల్లు మారేవాళ్ళం..నా చిన్నతనం లో ఆదుకోవడానికి మా నాన్న గారు కనీసం నాకు ఒక చిన్న బొమ్మని కూడా కొన్నివ్వలేకపోయారు..అవన్నీ తల్చుకుంటే చాలా బాధేస్తుంది’ అంటూ రష్మిక ఎమోషనల్ గ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.