Ponniyin Selvan Collections: ఈ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కి భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమాలలో ఒకటి ‘పొన్నియన్ సెల్వన్’..సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ లాంటి ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించారు..తమిళం లో పాపులర్ నవల ‘పొన్నియన్ సెల్వన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి తమిళనాడు లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మిగిలిన బాషలలో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఈ సినిమా ఇతర బాషలలో కూడా సూపర్ హిట్.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు పది కోట్ల రూపాయలకు కొనుగోలు చెయ్యగా, ఫుల్ రన్ రన్ 11 కోట్ల రూపాయిల వరుకు షేర్ వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది..ఇక తమిళనాడు బాక్స్ ఆఫీస్ లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం మామూలుది కాదు..రోజుకో మైల్ స్టోన్ ని దాటుకుంటూ చరిత్ర తిరగరాసిన ఈ సినిమా విడుదలై నేటికీ 50 రోజులు అయ్యింది.
ఈ 50 రోజులకు గాను ఈ సినిమా అన్ని భాషలకు కలిపి సుమారుగా 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి ఇప్పటికి కొన్ని ప్రాంతాలలో విజయవంతంగా నడుస్తుంది..ఈ చిత్రం 500 కోట్ల రూపాయిల మార్కుని అందుకున్నందుకు ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషించిన చియాన్ విక్రమ్ ట్విట్టర్ ‘మా సినిమా 500 కోట్ల రూపాయిలు వసూలు చేసిందా..ఇది కల కాదు నిజమని ఎవరైనా నన్ను గిల్లండి’ అంటూ ఆయన వేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది..ఈ సినిమాలో విక్రమ్ తో పాటు తమిళ హీరోలు కార్తీ మరియు జయం రవి కూడా ముఖ్య పాత్ర పోషించారు..సినిమా నిడివి మొత్తం హీరో కార్తీ కే ఎక్కువ ఉంటుంది.

అతి త్వరలోనే పార్ట్ 2 కూడా తెరకెక్కబోతుంది..సముద్రం లో మునిగిపోయిన ‘పొన్నియన్ సెల్వన్’ ఇంకా బ్రతికి ఉన్నాడా లేదా అనేది పార్ట్ 2 లో చూపించబోతున్నట్టు క్లైమాక్స్ లో ఒక హింట్ ఇస్తాడు మణిరత్నం గారు..పార్ట్ 1 భారీ హిట్ అయ్యింది కాబట్టి పార్ట్ 2 బిజినెస్ ఎవ్వరు ఊహించని రేంజ్ లో జరుగుతుంది..ఏది ఏమైనా మణిరత్నం ఈ సినిమా ద్వారా గ్రాండ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యాడు.