Bigg Boss 6 Telugu Srihan- Revanth: ప్రతి వారం లాగానే ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ చాలా రసవత్తరం గా సాగింది..అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్కు తో పాటు అదనంగా ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ ని కూడా నిర్వహించారు..ఈ గేమ్ లో శ్రీహాన్, రేవంత్ మరియు ఫైమా పాల్గొనగా శ్రీ సత్య సంచాలక్ గా వ్యవహరించింది..ఈ టాస్కులో ఎవరికైతే ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ దక్కడం ఇష్టం లేదో వాళ్ళ భుజాన తగిలించి ఉన్న కర్రకి ఇసుక మూట ని తగిలించాలి..ప్రతి కంటెస్టెంట్ వారికి ఇష్టం లేని పోటీ దారులకు మూడు ఇసుక మూటలను తగిలించే అవకాశం ఉంటుంది.

ఈ టాస్కు లో ఇంటి సభ్యులందరు రేవంత్ మరియు శ్రీహాన్ ని టార్గెట్ చేస్తారు..పాపం వీళ్ళు ఆ మూటలను మొయ్యలేక వాళ్ళు పడే బాధని చూస్తే ఎవరికైనా ‘అయ్యో పాపం’ అనిపించక తప్పదు..ఇద్దరు కూడా గొప్ప ఎఫ్ర్ట్స్ పెట్టారు..అయితే ఫైమా కి ఇంటి సభ్యులందరు సపోర్ట్ చేసారు.
ఆ సమయం లో సంచాలక్ గా వ్యవహరించిన శ్రీ సత్య కి కూడా ఎవరికో ఒకరికి మూటలను తగిలించే అవకాశం రావడం తో ఆమె ఫైమా కి రెండు మూటలు తగిలిస్తుంది..ఇక ఆ తర్వాత శ్రీహాన్ కి ఒక పక్క బ్యాలన్స్ తప్పిపోతుండడం తో శ్రీహన్ కి ఒక మూట తగిలిస్తుంది..ఇంటి సభ్యులందరు కలిసి వీళ్ళిద్దరిని టార్గెట్ చేసి ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ని దక్కకుండా చేసారు.

ఈ టాస్కు ని చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అయ్యింది ఏమిటి అంటే బిగ్ బాస్ కూడా వీళ్లిద్దరికీ వ్యతిరేకంగా ఫైమకి పరోక్షంగా సపోర్ట్ ఇచ్చాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్న మాట..బిగ్ బాస్ కావాలనే బజర్ సౌండ్ మోగకుండా చేసాడని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి..అయితే ఈ టాస్కులో వీళ్లిద్దరు ఓడిపోయినప్పటికీ సోషల్ మీడియా లో నెటిజెన్స్ దగ్గర బాగా మార్కులు కొట్టేసారు..ఓట్లు కూడా ఈ ఎపిసోడ్ వల్ల వీళ్లిద్దరికీ బలంగా పది ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.