Famous Singer Demise On Stage: సౌత్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయకుడు ఎడవ బషీర్ ఇక లేరు. ఒక మ్యూజిక్ లైవ్ కాన్సర్ట్‌లో పాట పాడుతూ ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయి మరణించారు. ఆయనను హుటాహుటని ఆసుపత్రికి తరలించినా అప్పటికే బషీర్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ప్రముఖ గాయకుడు యేసుదాసు పాడిన మానే హో తుమ్ అనే హిందీ సాంగ్‌ను ఆలపిస్తుండంగా ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి వచ్చింది.
దీంతో ఛాతీ నొప్పి భరించలేక స్టేజ్‌పైనే ఆయన కన్నుమూశారు. 78 ఏళ్ల ఎడవ బషీర్ ‘గాన మేళా’తో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. తిరువనంతపురం జిల్లాలోని వర్కాలకు సమీపంలో ఉన్న ఎడవ అనే ప్రాంతంలో బషీర్ పుట్టారు. చిన్న తనం నుంచే ఆయనకు సంగీతం అంటే ప్రాణం. స్వాతి తిరునాళ్ మ్యూజిక్ అకాడమీ నుంచి అకాడమిక్ డిగ్రీ ‘గానభూషణం’ అభ్యసించారు.
Also Read: Ganta Srinivasa Rao: టెన్షన్ పడుతున్న గంటా.. అందుకే టీడీపీలో యాక్టివ్ అయ్యారా?
ఆ తర్వాత 1972లో కొల్లంలో ‘సంగీతాలయ’ గాన మేళాన్ని స్థాపించి పేరు గడించారు. రఘువంశం అనే సినిమాకు మొదటిసారిగా నేపథ్య గాయకుడిగా ఆయన సినీ ప్రస్థానం మొదలు అయ్యింది. ఆల్ కేరళ మ్యూజిషియన్స్ అండ్ టెక్నిషియన్స్ వెల్ఫేర్ అసోషియేషన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆయనకు ఇద్దరు భార్యలు రషీదా, రెహ్నా, పిల్లలు ఉల్లాస్, బీమా, ఉమేశ్, ఉషుస్ సీత్తా ఉన్నారు.
ఇలా పాట పాడుతూ ఎడవ బషీర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా తీవ్ర ఆందోళనకు గురైంది. ఇక ఆయన విలువైన పాటలు వినబడవు, ఆయన స్వచమైన నవ్వులు కనబడవు. ఎన్నో దశాబ్దాలుగా తన పాటల్లోని బావలతో ఊహల్లో ఊరించి, ఊగించిన ఆ నిలువెత్తు మనిషి ఇక లేడు.
మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున ఎడవ బషీర్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
Also Read: Mahesh Babu Waiting For Her Video: ఆమె వీడియోల కోసం మహేష్ ఆత్రుతగా ఎదురుచూస్తుంటాడు !