Tv9 Only For TRP: టీవీ9 తొండాట.. టీఆర్పీ కోసం తాపత్రయం!!

Only For TRP: టీవీ9… పరిచయం అక్కరలేని న్యూస్‌ చానల్‌. తెలుగు వార్తా చానళ్ల రంగంలో టీవీ9 విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టీఆర్పీ రేటింగ్‌లో కొన్నేళ్లు ఏకఛత్రాధిపత్యం సాధించింది. అయితే అందతా గతం.. ప్రస్తుతం ఆ చానల్‌ పరిస్థితి దారుణంగా దిగజారిపోతోంది. టీఆర్పీ రేటింగ్‌ ఎన్నడూ లేనంతస్థాయికి దిగజారింది. ఈ క్రమంలో మాన్యుప్లేటెడ్‌ గేమ్‌ మొదలు పెట్టింది. వీక్షకులకు, ప్రేక్షకులను ఏమార్చే ఎత్తుగడకు తెరలేపింది. పడిపోతున్న పరిస్థితిని ఎక్కువ చేసి చూసే ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ […]

Written By: Raghava Rao Gara, Updated On : May 31, 2022 11:42 am
Follow us on

Only For TRP: టీవీ9… పరిచయం అక్కరలేని న్యూస్‌ చానల్‌. తెలుగు వార్తా చానళ్ల రంగంలో టీవీ9 విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. టీఆర్పీ రేటింగ్‌లో కొన్నేళ్లు ఏకఛత్రాధిపత్యం సాధించింది. అయితే అందతా గతం.. ప్రస్తుతం ఆ చానల్‌ పరిస్థితి దారుణంగా దిగజారిపోతోంది. టీఆర్పీ రేటింగ్‌ ఎన్నడూ లేనంతస్థాయికి దిగజారింది. ఈ క్రమంలో మాన్యుప్లేటెడ్‌ గేమ్‌ మొదలు పెట్టింది. వీక్షకులకు, ప్రేక్షకులను ఏమార్చే ఎత్తుగడకు తెరలేపింది. పడిపోతున్న పరిస్థితిని ఎక్కువ చేసి చూసే ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ క్రమంలో ఏ న్యూస్‌ చానల్‌ చేయని విధంగా సాక్షి పత్రికకు సోమవారం ఫస్ట్‌ పేజీలో ఫుల్‌సైజ్‌ యాడ్‌ వేసుకుంది. దేశంలో నంబర్‌వన్‌ చానల్‌ అని ప్రకటించుకుంది. దీనికి బీఆర్సీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ను సోరుసగా చెప్పుకుంది. సాధారణంగా పత్రికలు రీడబులిటీ పెంచుకునేందుకు టీబీ చానళ్లలో యాడ్స్‌ ఇవ్వడం తెలిసిందే. కానీ టీవీ9 సరికొత్త సంప్రదాయం మొదలు పెట్టింది.

TV9

ఎందుకిలా…

టీవీ9 రవిప్రకాశ్‌ చేతిలో ఉన్నతకాలం కొంత క్రెడిబులిటీ వార్తలు ఇచ్చేంది. అందులో ప్రసారమయ్యే వార్తలు, కథనాలు కూడా న్యూట్రల్‌గా ఉండేవి. యాజమాన్యం మారిన తర్వాత ఆ చానల్‌ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. టీఆర్పీ రేటింగ్‌లో అత్యంత కనిష్టస్థాయికి పడిపోయింది. వారాలు గడుస్తున్నా పరిస్థితి మెరుగు పడడం అటుంచి దిగజారిపోవడం కూడా ఆగడం లేదు. ప్రస్తుతం తెలుగు న్యూస్‌ చానళ్లలో ఎన్‌టీవీ నంబర్‌ వన్‌గా కొనసాగుతోంది. తెలుగులో తానే నంబర్‌ వన్‌ అని ఎన్టీవీ కొన్ని వారాలుగా గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. రూ కోట్ల బడ్జెట్‌ కేటాయించి పోస్టర్లు.. డిజిటల్‌.. బస్టాండ్లలో ప్రకటనల ద్వారా చెప్పుకుంటోంది.

Ravi Prakash

ఏమార్చేందుకు..

ప్రజల్లో టీవీ9కు పడిపోతున్న రేటింగ్‌ నుంచి ప్రేక్షకుల, వీక్షకులను ఏమార్చే ప్రక్రియకు చానల్‌ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. తామే నంబర్‌ వన్‌ అని వినూత్నంగా ప్రచారం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవుగా సాక్షిలో ప్రకటనలు ఇచ్చేసింది. రూ.లక్షలు పెట్టి ప్రకటనలు ఇస్తే.. స్వకార్యం.. స్వామి కార్యం రెండూ జరుగుతాయనుకున్నారేమో ఫుల్‌ పేజీ ప్రకటనలు ఇచ్చారు. అన్ని చానళ్ల కన్నా తామే నంంబర్‌ వన్‌ అని చెప్పదల్చుకున్నారు. అయితే ఏ రాష్ట్రంలో ఏ స్థానంలో ఉన్నారో మాత్రం చెప్పలేదు. రీజినల్‌ లాంగ్వేజ్‌ చానళ్లతో టీవీ9 రంగంలో ఉంది. హిందీలో పెట్టిన భారత్‌ వర్ష్‌ చానల్‌ ఫ్లాప్‌ అయింది. ఈ పరిస్థితుల్లో టీవీ రేటింగ్స్‌లో దేశంలో నెంబర్‌ వన్‌ ఎలా అవుతుంతో ఆ గ్రూపే చెప్పాల్సి ఉంది.

Also Read: Nagababu Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి నాగబాబు

దారుణ పతనానికి కారణం తెలుసుకోకుండా..

తెలుగులో టీవీ9 రేటింగ్‌ దారుణంగా పతనం అయింది. అయితే ఇందుకు కారణం తెలుసుకోవాల్సిన చానల్‌ యాజమాన్యం అది చేయకుండా ప్రకటనలతో తప్పుడు రేటింగ్స్‌ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రవిప్రకాశ్‌ సీఈవోగా ఉన్న సమయంలో తెలుగులో నంబర్‌వన్‌గా ఉన్న టీవీ9 యాజమాన్యం మారిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంది. రాజకీయ పార్టీల చేతుల్లోకి వెళ్లిపోవడంతో పతనం ప్రారంభమైంది. వారం వారం దిగజారిపోతోంది. కేవలం పార్టీనేతల జపం చేయడం, అధికార పార్టీకి అంటకాగే కథనాలు ఇవ్వడం, ప్రజల సమస్యలను బయటకు తీసుకురావడంలో విఫలం కావడం వంటి కారణాలే టీవీ9 దిగజారిపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆచానల్‌ రేటింగ్‌ ఎన్టీవీలో సగం కూడా లేదు. ఇతర రీజనల్‌ లాంగ్వేజ్‌లలో ఏ స్థాయిలో ఉందోటీవీ9 గ్రూప్‌ వివరంగా ప్రకటించి ఉండే.. ఆ చానల్‌ ఏ రేంజ్‌లో ఉందోఅంచనా వేయడానికి అవకాశం ఉండేది. మ్యానిప్యులేట్‌ చేయడంలో టీవీ9ది అందే వేసిన చేయి.. దానికి తగ్గట్లుగానే తామే నంంబర్‌ అవిని తెలుగు ప్రజల్ని నమ్మించడానికి నేషనల్‌ వైడ్‌ రైటింగ్స్‌తో సాక్షి మీడియా ద్వారా జిమ్మిక్కులు ప్రారంభించింది. మరి ఈ జిమ్మిక్కును ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చూడాలి మరి!!

Also Read: YCP Bus Yatra: వైసీపీ మంత్రులకు ఘోర అవమానం.. అలిగి వెళ్లిపోయిన బొత్స

Recommended Videos:


Tags