https://oktelugu.com/

Trisha : హీరోయిన్ త్రిష వల్ల నా జీవితం సర్వ నాశనం అయ్యింది అంటూ ప్రముఖ నిర్మాత సంచలన కామెంట్స్!

సినిమాకి దాదాపుగా 10 కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతుంది, కానీ మీకు నిర్మాత గారు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అని త్రిష కి చాడీలు చెప్పాడట డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి. సినిమాకి అంత బిజినెస్ జరుగుతున్నప్పుడు నాకు కనీసం కోటి రూపాయిల రెమ్యూనరేషన్ కూడా ఇవ్వకుంటే ఎలా అని త్రిష నిర్మాత గిరిధర్ తో గొడవకు దిగిందట.

Written By:
  • Vicky
  • , Updated On : September 6, 2024 9:50 pm
    Thrisha

    Thrisha

    Follow us on

    Trisha : దశాబ్దాల నుండి ఒక హీరోయిన్ స్టార్ స్టేటస్ ని మైంటైన్ చేయడం చిన్న విషయం కాదు. కొత్త హీరోయిన్స్ రాకతో పాత హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అవ్వడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. కేవలం ఒకే ఒక్క హిట్ తో స్టార్ స్టేటస్ కి చేరుకున్న కొంతమంది హీరోయిన్లు, ఆ తర్వాత కొన్ని ఫ్లాప్స్ రాగానే మాయం అయిపోతున్నారు. అలా కాకుండా హిట్,ఫ్లాప్ తో సంబంధం లేకుండా, ఒకే తరహా ఇమేజిని మైంటైన్ చేస్తూ వస్తున్న హీరోయిన్స్ అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో త్రిష ఒకరు. ఈమె మన చిన్నతనం లో ఉన్నప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఉండేది. అప్పట్లో సౌత్ ఇండియాలో కోటి రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్న మొట్టమొదటి హీరోయిన్ గా త్రిష అప్పట్లో చరిత్ర సృష్టించింది. తెలుగు, తమిళం భాషల్లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన ఇమేజిని పెంచుకుంటూ వెళ్ళింది త్రిష.

    మధ్యలో ఆమెకి కూడా కొన్ని ఫ్లాప్స్, డిజాస్టర్స్ తగిలాయి కానీ, అవి ఆమె కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికీ కూడా ఆమె స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ వరుస హిట్స్ తో ముందుకు దూసుకుపోతూనే ఉంది. చిన్నప్పుడు ఆమెని మనం స్టార్ గా ఏ స్థాయిలో చూసామో, ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో కొనసాగుతూ ముందుకు దూసుకుపోతుంది. ఇన్నేళ్ల కెరీర్ లో వృత్తి పరంగా ఒక్క రిమార్క్ కూడా లేని త్రిష, ఒక దర్శకుడి కారణంగా తనని అపార్థం చేసుకొని, నా జీవితాన్ని సర్వనాశనం చేసింది అంటూ నిర్మాత గిరిధర్ మామిడిపల్లి ఆమెపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది. బాలయ్య బాబు లయన్ చిత్రం లో త్రిష హీరోయిన్ గా చేస్తున్న రోజులవి. త్రిష తో ఒక సినిమా చేయాలనేది నా కోరిక. ఒకసారి త్రిష డేట్లు కుదిరాయి కానీ, కథ దొరకలేదు. మీతో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా చెయ్యాలని అనుకుంటున్నాం అని ఆమెకి చెప్పగా ఓకే అనింది. చాలా కథలు ఆమెకి పంపించాం కానీ, ఆమెకి నచ్చలేదు. అలాంటి సమయంలో డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి ఒక హారర్ కథతో మా దగ్గరకి వచ్చాడు. ఆ కథ త్రిష కి బాగా నచ్చింది. వెంటనే సినిమా షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టాము. ముందుగా త్రిష కి ఒక రెమ్యూనరేషన్ అనుకొని ఆమెకు చెప్పాము, అందుకు ఆమె ఒప్పుకుంది. సినిమా మొదలయ్యాక కొన్ని రోజులు షూటింగ్ సజావుగానే నడిచింది. షూటింగ్ పూర్తి అవుతున్న సమయంలో ఈ సినిమా బిజినెస్ మొదలైంది.

    ఈ సినిమాకి దాదాపుగా 10 కోట్ల రూపాయిల బిజినెస్ జరుగుతుంది, కానీ మీకు నిర్మాత గారు చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అని త్రిష కి చాడీలు చెప్పాడట డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి. సినిమాకి అంత బిజినెస్ జరుగుతున్నప్పుడు నాకు కనీసం కోటి రూపాయిల రెమ్యూనరేషన్ కూడా ఇవ్వకుంటే ఎలా అని త్రిష నిర్మాత గిరిధర్ తో గొడవకు దిగిందట. ఇప్పటికే సినిమాకి బడ్జెట్ బాగా పెరిగిపోయింది, అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేము, కావాలంటే తమిళ వెర్షన్ సాటిలైట్ రైట్స్ ఇస్తాను అని త్రిష తో అన్నాడట. దానికి ఆమె ఒప్పుకోలేదు, అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడం తో చేసేదేమి లేక ఇచ్చాము. సినిమా విడుదల అయ్యాక ఘోరమైన డిజాస్టర్ అయ్యింది, నా జీవితం తలక్రిందులు అయ్యింది అంటూ నాయకి నిర్మాత గిరిధర్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కన్నీటి పర్యంతం అయ్యాడు.

    Tollywood Producer Giridhar Shocking Comments On Trisha Nayaki Movie | Leo Entertainment