HomeతెలంగాణUttam Kumar Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్‌ పెద్ద స్కెచ్.. తెలంగాణ నెక్ట్స్‌ సీఎం ఉత్తమ్‌.. కాంగ్రెస్...

Uttam Kumar Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్‌ పెద్ద స్కెచ్.. తెలంగాణ నెక్ట్స్‌ సీఎం ఉత్తమ్‌.. కాంగ్రెస్ కు షాక్ లగా?

Uttam Kumar Reddy: తెలంగాణలో సీఎం మార్పు తప్పదా.. పాత కాంగ్రెస్‌ విధానమే తెలంగాణలో అమలు చేయబోతోందా.. ఈమేకు కసరత్తు మొదలైందా అంటే అవుననే అంటున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీతోపాటు కాంగ్రెస్‌లోని ఒక వర్గం. టీ కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్, సీనియర్‌ నేత అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సీఎం చేయాలని కొంత మంది నేతలు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్‌లోని ఓ వర్గం కూడా ఇందుకు మద్దతు తెలుపుతోంది. అధికార పార్టీకి సబంధించి ఏదో ఒకటి మాట్లాడితే.. దానిపై కాంగ్రెస్‌ వర్గమంతా ఏకమై ఎదురుదాడి చేయకపోతే.. ఏందో ఉందన్న సంకేతం వెళ్తుందన్న ఆలోచనతోనే ఈ ప్రచారం జరుగుతుందని సమాచారం. రేవంత్‌రెడ్డిని తప్పించాలని చూస్తున్న కాంగ్రెస్‌లోని ఓ వర్గం కూడా దీనికి వత్తాసు పలుకుతోంది. అయితే ఈ ప్రచారంతో రేవంత్‌రెడ్డి మరింత బలపడే అవకాశం కూడా ఉంది. అధిష్టానం వద్ద రేవంత్‌కు ఇప్పటికీ మంచి గుర్తింపు ఉంది. ఆయన నిర్ణయాలను అధిష్టానం స్వాగతిస్తోంది. కానీ, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు పనిగట్టుకుని ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రచారం చేయాలని చూస్తున్నారు.

లాభం కన్నా నష్టమే ఎక్కువ..
సీఎం మార్పుపై ప్రచారం చేస్తున్న పార్టీలు ఉత్తమ్‌ పేరును తెరపైకి తెచ్చాయి. అయితే దీంతో ఉత్తమ్‌ వర్గం తమకు కలిసి వస్తుందని, రేవంత్‌ వర్గానికి నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. కానీ, ఈ ప్రచారంతో ఉత్తమ్‌కు గానీ, రేవంత్‌కు గానీ నష్టం ఉండదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా విఫలమయ్యారనే అభిప్రాయం అధిష్టానం దృష్టిలో ఉంది. ఆయన సారథ్యంలో రెండుసార్లు ఎన్నికలకు వెళ్లినా పార్టీని గెలిపించలేదు. ఈ క్రమంలో ఉత్తమ్‌ను సీఎంను చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం సుముఖంగా లేదు. దీంతో రేవంత్‌కు జరిగే నష్టం లేకపోగా, మరింత లాభం జరుగుతుందన్న చర్చ కూడా జరుగుతోంది.

రేవంత్‌పై కుట్రలు..
ఇక రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక ఆయనను దించడానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ తీవ్రంగా ప్రయత్నించారు. వీరు ప్రత్యేక గ్రూపు కట్టారు. ఈ విషయం అధిష్టానం దృష్టిలో ఉంది. సీనియర్లు ఎంత ఒత్తిడి చేసినా పీసీసీ చీఫ్‌గా రేవంత్‌నే అధిష్టానం కొనసాగించింది. ఆయన అధిష్టానం నమ్మకాన్ని నిలబెట్టారు. కాంగ్రెస్‌ను తెలంగాణలో అధికారంలోకి తెచ్చారు. దీంతో అధిష్టానం రేవంత్‌రెడ్డిని మార్చే ఆలోచన చేసే అవకాశం లేదు. దీంతో సీఎం మార్పు ప్రచారంతో మరోసారి విపక్షాలు అభాసుపాలు కావడం ఖాయం అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version