Sai Dharam Tej: మిస్టర్ కూల్ గా పేరున్న సాయి ధరమ్ తేజ్ కి కోపం వచ్చింది. ఓ నెటిజన్ కి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష తో భారీ హిట్ కొట్టారు. ఆ మూవీ అంచనాలకు మించి విజయం సాధించింది. బైక్ ప్రమాదంతో బ్రేక్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ అనంతరం భారీ హిట్ కొట్టాడు. ఇటీవల బ్రో మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. మామయ్య పవన్ కళ్యాణ్ తో బ్రో మూవీ చేశారు ఆయన. అందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ని నేను ఒక గురువులా భావిస్తాను. ఆయనతో నటించడం గొప్ప అదృష్టం అని చెప్పుకొచ్చారు.
బ్రో మూవీ సైతం ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. తాజాగా ఆయన సత్య షార్ట్ ఫిల్మ్ చేశారు. సత్య షార్ట్ ఫిల్మ్ లో సాయి ధరమ్ తేజ్- కలర్స్ స్వాతి జంటగా నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్ కి నవీన్ విజయ్ కృష్ణ దర్శకుడు. సోల్ ఆఫ్ సత్య అనే వీడియో సాంగ్ అప్డేట్ ని సాయి ధరమ్ తేజ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. సాయి ధర తేజ్ పోస్ట్ కి పలువురు అభిమానులు స్పందించారు. నాగబాబు కూతురు నిహారిక సైతం బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. అలాగే సాంగ్ చూడాలని ఎంతో ఆతృతగా ఉందని కామెంట్ చేసింది.
నిహారిక కామెంట్ క్రింద ఓ నెటిజెన్స్ అనుచిత కామెంట్ చేశాడు. నిహారిక వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ.. ‘ఇలాంటి వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్ ఫ్యామిలీ మీద లేకపోయే’ అని కామెంట్ చేశాడు. సందర్భం లేకుండా నిహారిక వ్యక్తిగత జీవితం టార్గెట్ చేసిన నెటిజెన్ మీద సాయి ధరమ్ తేజ్ మండిపడ్డాడు. నువ్వు ముందు ఆ కామెంట్ డిలీట్ చెయ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. సాయి ధరమ్ తేజ్ రియాక్షన్ వైరల్ అవుతుంది.
కొందరు సాయి ధరమ్ తేజ్ మంచి పని చేశాడు. అలాంటి వాళ్లకు ఇలానే బుద్ది చెప్పాలని అంటున్నారు. కొందరేమో ముక్కూ ముఖం తెలియనివాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. నిహారిక ఇటీవల విడాకుల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని ఎత్తి చూపుతూ నెటిజెన్ ఆ కామెంట్ చేశాడు. నిహారిక-వెంకట చైతన్య పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
View this post on Instagram