Homeఎంటర్టైన్మెంట్Fake Movie Reviews Youtuber: రివ్యూల పేరిట దందా... పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్

Fake Movie Reviews Youtuber: రివ్యూల పేరిట దందా… పోలీసుల అదుపులో ప్రముఖ యూట్యూబర్

Fake Movie Reviews Youtuber: సినిమా రివ్యూల పేరిట దందా చేస్తున్న ప్రముఖ యూట్యూబర్(YOUTUBER ARREST) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు ఇవ్వకపోతే నెగిటివ్ రివ్యూలు ఇస్తానంటూ సదరు యూట్యూబర్ బెదిరించడంతో, నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రివ్యూలు సినిమాను చంపేస్తున్నాయని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ లో ప్రీమియర్ పడిన వెంటనే సోషల్ మీడియాలో రివ్యూలు దర్శనం ఇస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కొందరు క్రిటిక్స్ తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు. ఈ రివ్యూల ఆధారంగా ప్రేక్షకులు ఒక సినిమా చూడాలా? వద్దా? అని డిసైడ్ అవుతున్న్నారు. అర్హత ఉన్న క్రిటిక్స్ జెన్యూన్ రివ్యూలు ఇస్తే పర్లేదు. అయితే ఈ సినిమా రివ్యూల వ్యవహారం ఒక దందాగా మారింది. కొందరు రివ్యూవర్స్ నిర్మాతలపై బెదిరింపులకు దిగుతున్నారని సమాచారం.

Also Read: ఎన్టీఆర్ కి ఏమైంది అసలు..? ఇలా అయిపోయాడేంటి!

సినిమా విడుదలైన వెంటనే సదరు నిర్మాతలతో బేరసారాలకు దిగుతున్నారట. డబ్బులు ఇస్తే పాజిటివ్ రేటింగ్, లేదంటే నెగిటివ్ రేటింగ్ ఇస్తామని బెదిరిస్తున్నారట. ఓ ప్రముఖ యూట్యూబర్ చాలా కాలంగా ఈ దందా సాగిస్తున్నాడని సమాచారం. ఒక్కో రివ్యూకు రూ. 40 వరకు డిమాండ్ చేస్తున్నాడట. అడిగిన సొమ్ము ఇస్తేనే పాజిటివ్ రేటింగ్ ఇస్తాడట. లేదంటే నెగిటివ్ రివ్యూ వైరల్ చేసి సినిమాను దెబ్బ తీస్తానని హుకుం జారీ చేస్తున్నాడట.

తాజాగా ఓ నిర్మాతను సదరు యూట్యూబర్ ఇదే తరహాలో బెదిరించాడట. దాంతో నిర్మాత పోలీసులను ఆశ్రయించాడు. దాంతో ఫిల్మ్ నగర్ పోలీసులు సదరు యూట్యూబర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా హీరోల యాంటీ ఫ్యాన్స్ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ, సినిమా ఫలితాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. వారికి తోడు ఫేక్ రివ్యూవర్స్ ఎక్కువైపోయారు.

డబ్బులు తీసుకుని విషయం లేని సినిమాను కూడా అద్భుతం అని ప్రచారం చేసే పీఆర్లు కూడా ఉన్నారు. ఫస్ట్ షో పడిన గంటలోపే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రివ్యూలు ఓపెనింగ్స్ ని దెబ్బ తీస్తున్నాయి. కనీసం వీకెండ్ వరకైనా వసూళ్లు రాబట్టుకునే అవకాశం లేకుండా పోతుంది. సినిమా విడుదలైన కొన్ని రోజుల వరకు రివ్యూలు రాకుండా చర్యలు తీసుకోవాలని బడా నిర్మాతలు సైతం డిమాండ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో యుగంలో ఈ రివ్యూలను కట్టడి చేయడం అంత సులభం కాదు.

Exit mobile version