Srikalahasti Driver Case: ట్విస్టుల మీద ట్విస్టులు.. మలుపుల మీద మలుపులు.. ఒక విషయం తెలియగానే మరో విషయం వెలుగులోకి వస్తోంది. దాని గురించి విశ్లేషిస్తుండగానే ఇంకొకటి బయటపడుతోంది. దీంతో ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు దిమ్మ తిరిగిపోతోంది. ఇటీవల కాలంలో పోలీసులకు ఈ స్థాయిలో తలనొప్పిగా మారిన కేసు మరొకటి లేదంటే ఇందులో ఉన్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఏమిటి ఆ కేసు? ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? దాని వెనుక ఉన్న సంక్లిష్టతలు ఏమిటి?
ఇటీవల శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంచార్జ్ కోటా వినూత మాజీ డ్రైవర్ శ్రీనివాసరాయుడు విగత జీవిగా కనిపించాడు. చెన్నైలోని ఓ ప్రాంతంలో అతడు అత్యంత దారుణమైన స్థితిలో చనిపోయి దర్శనమిచ్చాడు. అతడి చేతి మీద కోట వినూత పేరు ఉండడంతో పోలీసులకు క్లారిటీ వచ్చింది. చనిపోయిన వ్యక్తి శ్రీనివాసరాయుడు అని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత వారిదైన కోణంలో కేసు దర్యాప్తు చేశారు. చివరికి కోటా వినూత, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులు ఉండడంతో.. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఈ కేసు విచారణలో రోజుకో తీరుగా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..” ఆ పడక గదిలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మేము ఏకాంతంగా ఉన్న దృశ్యాలను రికార్డు చేశారు. అవన్నీ కూడా బయట పెడతానని బెదిరించారు. ఆ సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసింది శ్రీనివాసరాయుడు. ఈ విషయంపై అతడిని నిలదీశాం. మర్యాదగా ఇవ్వాలని అడిగాం. అతడు ఒప్పుకోలేదు. మా ప్రత్యర్థికి వాటిని ఇచ్చాడు. 30 లక్షలకు వాటిని విక్రయించాడు. అందువల్లే అతడు ఇలా అయిపోయాడని” కోట వినూత విచారణలో భాగంగా చెప్పారని పలు మీడియా సంస్థలలో కథనాలు ప్రసారమయ్యాయి..
Also Read: Kota Vinutha Offer: ప్రాణం ఖరీదు ₹30 లక్షలు.. ఆఫర్ చేసిన కోట వినూత
కోటా వినూత చెప్పింది నిజం అనుకుంటే .. శ్రీనివాసరాయుడిని పడక గది దాకా ఎందుకు రానిచ్చారు? ఎంత సాన్నిహిత్యం ఉంటే మాత్రం అక్కడిదాకా ఎందుకు రానిస్తారు? కోట వినూత పడకగదిలోకి ప్రవేశించడానికి ఆమె భర్తకు తప్ప మరొక వ్యక్తికి అవకాశం ఉండదు. చివరికి కుటుంబ సభ్యులు కూడా ఆ గదిలోకి వెళ్లడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు శ్రీనివాసరాయుడు అక్కడిదాకా ఎలా వెళ్లాడు.. అంత సాన్నిహిత్యం అతడికి ఎవరు ఇచ్చారు? పైగా అతడు సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి.. వీడియోలు బయటకు వచ్చేదాకా ఆమె ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయింది? కోటా వినూత పేరు శ్రీనివాస రాయుడు చేతి మీద పచ్చబొట్టు లాగా ఎందుకు ఉంది.. ఎంత నమ్మకంగా పనిచేసినా సరే.. ఒక యజమానిమీద డ్రైవర్ కు ఆ స్థాయిలో ప్రేమ ఎందుకు ఉంటుంది.. చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అంటే అది వేరే అర్థం తీస్తోంది. మరోవైపు శ్రీనివాసరాయుడుతో వినూత దిగిన ఫోటోలు కూడా వేరే అనుమానాలకు తావిస్తున్నాయి.. ఆ ఫోటోలను ఓ పార్టీ నాయకులు బయటపెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
వీడియోలు బయటికి వచ్చినప్పుడు.. పైగా వినూత ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధికారంలో ఒక భాగం అయినప్పుడు.. పోలీసుల ద్వారా చెప్పించవచ్చు కదా.. అలా చేయకుండా నేరుగా వారే ఇన్వాల్వ్ అయ్యారు. పైగా శ్రీనివాసరాయుడిని అంతం చేసిన తర్వాత అతడు సోదరికి ఫోన్ చేసి.. 30 లక్షలు ఇస్తామని చెప్పినట్టు మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. దానికి ఆమె ఒప్పుకోలేదని.. సామాజిక న్యాయం కావాలని కోరిందని.. ఆ మీడియా కథనాలలో తెలుస్తోంది.. శ్రీనివాస రాయుడు చేతి మీద వినూత పేరు పోలీసులకు బలమైన ఆధారంగా ఉన్నాయి. ఇప్పుడు విచారణలో వినూత దంపతులు ఏకంగా సీక్రెట్ కెమెరాలు.. వీడియోలు అని చెబుతున్నారు… శ్రీనివాస రాయుడు సోదరి 30 లక్షలు ఇస్తామని చెప్పారని అంటున్నది. మరోవైపు శ్రీనివాసరాయుడు నానమ్మ చెప్పిన విషయం ఇంకో విధంగా ఉంది.. ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలుసని .. తన మనవడి ప్రాణాలు కాపాడాలని చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదని వాపోతోంది. ఇలా ఎటు చూసినా సరే ఈ కేసులో అనేక సంక్లిష్టతలు కనిపిస్తున్నాయి.. చూడాలి మరి ఈ చిక్కుముడులు ఎప్పుడు విడిపోతాయో?