Adavi Sesh- Faima: బిగ్ బాస్ సీజన్ 6 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా కొనసాగిన ఫైమా నిన్న ఎలిమినేట్ అయ్యి ఇంటి ముఖం పట్టిన సంగతి తెలిసిందే..గత కొద్దిరోజుల నుండి వోటింగ్ గ్రాఫ్ దారుణంగా పడిపోగా టాప్ 5 లోకి ఆమె వస్తుందనే ఆశలు ఆమె అభిమానుల్లో రోజు రోజుకి పడిపోయాయి..ఫలితంగా ఇలా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది..వాస్తవానికి ఆమె గత వారం లోనే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది..కానీ ఏవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకున్న కారణంగా ఆమె ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యింది..ఆమె బదులు రాజ్ ఎలిమినేట్ అయిపోయాడు.

ఇక ఫైమా ఎలిమినేట్ అయ్యేసరికి ఆది రెడ్డి కూడా బాగా బాధపడ్డాడు..గీతూ ఎలిమినేట్ అయ్యినప్పుడే ఏడుపు ని కంట్రోల్ చేసుకున్న ఆదిరెడ్డి..ఫైమా ఎలిమినేట్ అయ్యినప్పుడు మాత్రం ఏడవడం అందరిని షాక్ కి గురి చేసింది..ఇక ప్రతి ఆదివారం లాగానే నిన్న కూడా హౌస్ మొత్తం ఫన్నీ టాస్కులతో హోరెత్తిపోయింది..నిన్న ‘హిట్ 2’ ప్రొమోషన్స్ లో భాగంగా అడవి శేష్, హీరోయిన్ మీనాక్షి మరియు డైరెక్టర్ శైలేష్ వచ్చారు.
కంటెస్టెంట్స్ మమేకమై అడవి శేష్ చేసిన ఫన్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ పంచింది..అడవి శేష్ వచ్చే ముందు నాగార్జున హౌస్ మేట్స్ చేతిలో అడ్డం పై కోడి బుర్ర అని రాసి పుర్రె గుర్తుని వేయిస్తారు..ఇక ఆ తర్వాత అడవి శేష్ ని అది హౌస్ లో ఎవరు గీసారో కనిపెట్టు అంటాడు..ఇక ఆ తర్వాత సరదాగా అడవి శేష్ కి నాగార్జున కి మరియు కంటెస్టెంట్స్ కి మధ్యలో ఫన్నీ డిస్కషన్ నడిచింది.

ముందుగా నాగార్జున మాట్లాడుతూ ‘ఫైమా నిన్ను చాలా మాటలు అనేసింది’ అని అంటాడు అడవి శేష్ తో..అప్పుడు అడవి శేష్ ఫైమా తో మాట్లాడుతూ ‘బయట సోషల్ మీడియా లో నేను నీ గురించి ఎంతో గొప్ప గా చెప్పాను..నాకు ఆదర్శం అని కూడా అన్నాను..నీ గురించి నేను అంత మంచిగా మాట్లాడితే ఇక్కడ నా గురించి ఇలా మాట్లాడుతావా’ అని ఫైమా ని కాసేపు ఆటపట్టిస్తాడు అడవి శేష్..ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.