https://oktelugu.com/

Fahadh Faasil: ‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిల్ తండ్రి దర్శకత్వం లో తెరకెక్కిన నాగార్జున సినిమా అదేనా..? చూస్తే ఆశ్చర్యపోతారు!

హాద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్. రెండు దశాబ్దాల వరకు ఆయన మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మమ్ముటి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల ఇమేజి మరో లెవెల్ కి తీసుకెళ్లేలా ఈయన చిత్రాలు అప్పట్లో తెరకెక్కాయి. ఈయన మన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తో కూడా ఒక సినిమా చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 29, 2024 / 02:00 AM IST

    Fahadh Faasil(1)

    Follow us on

    Fahadh Faasil: సౌత్ ఇండియా లో యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరైన హీరోలలో ఒకడు ఫహాద్ ఫాజిల్. మలయాళం లో స్టార్ హీరో గా చలామణి అవుతున్న ఫహాద్ ఫాజిల్, మన తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితమే. కేవలం హీరో పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా నటనకి ప్రాధాన్యం ఉండే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగా ఉంటాడు ఫాజిల్. రీసెంట్ గా ఆయన సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వెట్టియాన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్యారక్టర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి ముందు ఆయన మన తెలుగు ఆడియన్స్ కి పుష్ప చిత్రం ద్వారా బాగా దగ్గరయ్యాడు. ఈ చిత్రం క్లైమాక్స్ ముందు ఈయన ఎంట్రీ ఉంటుంది. కనిపించేది కాస్త తక్కువసేపే అయ్యినప్పటికీ, ఆడియన్స్ గుర్తించుకోదగిన విధంగా ఆయన అద్భుతంగా నటించాడు. ఇప్పుడు మరో వారం రోజుల్లో ‘పుష్ప 2’ ద్వారా మరోసారి ఆయన నట విశ్వరూపం చూడబోతున్నాము.

    ఇదంతా పక్కన పెడితే ఫహాద్ ఫాజిల్ తండ్రి ఫాజిల్ ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్. రెండు దశాబ్దాల వరకు ఆయన మలయాళం ఫిలిం ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మమ్ముటి, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల ఇమేజి మరో లెవెల్ కి తీసుకెళ్లేలా ఈయన చిత్రాలు అప్పట్లో తెరకెక్కాయి. ఈయన మన టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తో కూడా ఒక సినిమా చేసాడు. ఆ చిత్రం పేరు కిల్లర్. నగ్మా హీరోయిన్ గా, జగపతి బాబు తండ్రి వీబీ రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా ద్వారా ఫాజిల్ నాగార్జున లోని నెగటివ్ యాంగిల్ ని బయటకి తీసాడు. ఈ చిత్రం కోసం ఇళయరాజా అందించిన బాణీలు అప్పట్లో ఆడియన్స్ ని ఒక ఊపు ఊపింది.

    ఈ సినిమా తర్వాత మళ్ళీ ఫాజిల్ ఎలాంటి తెలుగు సినిమా చేయలేదు. వాస్తవానికి ఈ చిత్రాన్ని కూడా ఆయన మోహన్ లాల్ తోనే తియ్యాలని అనుకున్నాడట. కానీ ఈ సినిమాలో హీరో ది నెగటివ్ క్యారక్టర్. మోహన్ లాల్ అప్పుడే వరుసగా కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్ ని అందుకొని మంచి ఊపు మీద ఉన్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో అంత ఇమేజ్ ఉన్న హీరోని నెగటివ్ గా చూపిస్తే జనాలు రిసీవ్ చేసుకోవడం కష్టం అనే ఉద్దేశ్యంతో ఆ ఆలోచనని విరమించుకున్నాడు. అయితే ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుండే నాగార్జున ఈ సినిమా ని రిస్క్ చేసి చేసాడు. ఫలితం అదిరిపోయింది. కలెక్షన్స్ లో కొన్ని రికార్డ్స్ తో పాటు, 100 డేస్ సెంటర్స్ కౌంట్ కూడా బాగానే వచ్చింది.