F3 Movie Review: రివ్యూ : ఎఫ్ 3

F3 Movie Review: రివ్యూ: ఎఫ్ 3 దర్శకత్వం : అనిల్‌ రావిపూడి నిర్మాత : శిరీష్ సంగీతం : దేవీశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి స్క్రీన్ ప్లే : అనిల్‌ రావిపూడి ఎడిటర్ : తమ్మిరాజు నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, మురళీశర్మ, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు. డబ్బు వల్ల వచ్చే అనర్థాలను ఫన్నీగా చూపిస్తూ రూపుదిద్దుకున్న సినిమా ‘ఎఫ్‌-3’. ఎఫ్ 2కి.. మూడింతలు వినోదంతో […]

Written By: Shiva, Updated On : May 27, 2022 4:47 pm

F3 Movie Review

Follow us on

F3 Movie Review: రివ్యూ: ఎఫ్ 3

దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
నిర్మాత : శిరీష్
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్ : సమీర్ రెడ్డి
స్క్రీన్ ప్లే : అనిల్‌ రావిపూడి
ఎడిటర్ : తమ్మిరాజు

venkatesh, varun tej

నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, మురళీశర్మ, తమన్నా, మెహరీన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు.

డబ్బు వల్ల వచ్చే అనర్థాలను ఫన్నీగా చూపిస్తూ రూపుదిద్దుకున్న సినిమా ‘ఎఫ్‌-3’. ఎఫ్ 2కి.. మూడింతలు వినోదంతో వస్తున్నాం అంటూ ప్రమోట్ అయిన
‘ఎఫ్ 3’ ఫైనల్ గా రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు నవ్వించగలిగిందో రివ్యూ చూసి తెలుసుకుందాం !

Also Read: Venkatesh Fun with Bithiri Sathi : బిత్తిరి సత్తికి లైవ్ లోనే షాకిచ్చిన వెంకటేశ్

కథ :

వెంకీ (వెంకటేష్) లైఫ్ సమస్యలతో నిండిపోయి ఉంటుంది. సవతి తల్లి ఇంటి కష్టాలు, బయట అప్పుల గోల, మధ్యలో (తమన్నా) ఫ్యామిలీ చేతిలో మోసపోవడం..ఇలా వెంకీ చాలా ఇబ్బందులు పడుతూ డబ్బు కోసం యుద్ధం చేస్తుంటాడు. మరోపక్క వరుణ్ (వరుణ్ తేజ్) ఎప్పుడూ డబ్బు సంపాదన కోసం తెగ కష్టపడుతూ ఉంటాడు.ఈ క్రమంలో కొన్ని ప్రయత్నాలు చేసి విఫలం అవుతాడు. మరో పక్క హారిక (తమన్నా) ఫ్యామిలీ వరుణ్ ను కూడా మోసం చేస్తోంది. ఇలా అందరూ కష్టాల్లో నలిగిపోతూ ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో ఒక వీడియో చూస్తారు. ఆ వీడియోలో.. విజయనగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త (మురళీ శర్మ) తన తప్పిపోయిన కొడుకు కోసం వెతుకుతున్నట్లు ఉంటుంది. దాంతో ఎవరికీ వారు కొడుకుగా నమ్మించి కోట్లాది ఆస్తికి వారసులు కావాలని ప్లాన్ చేసుకుని మురళీశర్మ దగ్గరకు వెళ్తారు. అక్కడ వీరు ఎదురైన సంఘటనలు ఏమిటి ? ఆ తర్వాత వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి ? అసలు మురళీశర్మ కొడుకు కథ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

అనిల్ రావిపూడి తన డిఫరెంట్ క్యారెక్టర్స్ తో అండ్ క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాడు. అలాగే క్వాలిటీ ఫన్ తో ఫుల్ గా నవ్వించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాల్లో వచ్చే సీన్స్ లో అయితే, అద్భుతమైన కామెడీ టైమింగ్ తో బాగా ఎంటర్ టైన్ చేశాడు. అలాగే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే వెంకీ -వరుణ్ ల లోపాలను కూడా చాలా ఫన్నీగా ఎలివేట్ చేశాడు. హీరోలు కూడా, ముఖ్యంగా వెంకటేష్ ‘వెంకీ పాత్ర’లో లీనం అయిపోయాడు. తన మార్క్ బాడీ లాంగ్వేజ్ తో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాకే హైలైట్ గా నిలిచాడు. వరుణ్ తేజ్ కూడా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి రైటింగ్ టేబుల్‌ దగ్గరే స్క్రిప్ట్ ను బ‌లంగా రాసుకున్నాడు.

F3 Movie Review

అదే స్థాయిలో సినిమాని తెర‌పైకి తీసుకొచ్చాడు. డబ్బు కోసం ఇద్దరు ఫ్యామిలీ మ్యాన్స్ పడే ఇబ్బందుల ప‌రిణామ క్ర‌మాన్ని కూడా చాలా బాగా చూపించాడు. ఇక సినిమాలో పాత్ర‌లు, వాటి ప‌రిచ‌యం, కొన్ని కీలక సన్నివేశాలు స‌ర‌దాగా సాగుతూ.. జోష్ పెంచాయి. కాకపోతే.. ద్వితీయార్థంలో క‌థ నెమ్మ‌దిస్తుంది. కామెడీ సినిమా కాబట్టి.. అనిల్ కూడా స్క్రీన్ ప్లేలో చాలా చోట్ల లాజిక్స్ వదిలేశాడు. దాంతో ఈ సినిమా కామెడీ సినిమాగానే మిగిలిపోయింది. నిజానికి కొన్ని సీన్స్ లో ఎమోష‌న్స్ పండినా… ప్ర‌తీ పాత్ర‌కూ జస్ట్ జ‌స్టిఫికేష‌న్ ఇవ్వటానికి తప్ప ఇంట్రెస్ట్ కలిగించలేదు. హీరోయిన్లు తమన్నా, మెహరీన్, పోలీస్ గా రాజేంద్రప్రసాద్, కోటీశ్వ‌రుడిగా ముర‌ళీశ‌ర్మ, ఫ్రెండ్ గా సునీల్ తమ పాత్రల్లో జీవించారు.

ప్లస్ పాయింట్స్ :

వెంకటేష్ నటన,

తమన్నా గ్లామర్, పూజా హెగ్డే ఐటమ్ సాంగ్,

మెయిన్ పాయింట్, కథలోని కామెడీ,

కామెడీ సన్నివేశాలు,

సంగీతం,

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ స్లోగా సాగడం,

సినిమాటిక్ టోన్ ఎక్కువ అవ్వడం,

సైడ్ ట్రాక్స్.

సినిమా చూడాలా ? వద్దా ? :

పక్కా కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సరదగా సాగుతూ బాగానే ఎంటర్టైన్ చేస్తోంది. కానీ, గ్రిప్పింగ్ నరేషన్ లేకపోవడం, కథలో సహజత్వం మిస్ అవ్వడం సినిమాకి మైనస్. అయితే, కామెడీ అంశాలు బాగున్నాయి. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా చూడొచ్చు.

రేటింగ్ : 3 /5

Also Read:Dil Raju: F3లో పవన్ కళ్యాణ్.. ఇదీ అసలు కిక్కంటే.. ఇక రచ్చ రచ్చే

Recommended Videos


Tags