https://oktelugu.com/

F3 Movie: డేంజర్ జోన్లోకి ‘ఎఫ్-3’.. ఒకేసారి అంతమందికి పాజిటివ్..!

F3 Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కొత్త కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనాతోపాటు ఒమ్రికాన్ కేసులు భారీగా వెలుగు చూస్తుండటంతో చిన్న, పెద్ద స్టార్స్ అంతా షూటింగులకు ప్యాకప్ చెబుతున్నారు. అయితే కొంతమంది ఇప్పటికే తమ కాల్షీట్లు ఇవ్వడంతో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులకు హాజరవుతున్నారు. హైదరాబాద్లో కరోనా కేసులు భారీగా నమోదువుతుండగా కొంతమంది దర్శక, నిర్మాతలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు చేస్తున్నారు. అయితే ఇదే వారి కొంప ముంచినట్లు తెలుస్తోంది. గత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 10, 2022 4:47 pm
    Follow us on

    F3 Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కొత్త కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనాతోపాటు ఒమ్రికాన్ కేసులు భారీగా వెలుగు చూస్తుండటంతో చిన్న, పెద్ద స్టార్స్ అంతా షూటింగులకు ప్యాకప్ చెబుతున్నారు. అయితే కొంతమంది ఇప్పటికే తమ కాల్షీట్లు ఇవ్వడంతో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులకు హాజరవుతున్నారు.

    actor-venkatesh-and-varun-tej-movie-f3-release-on-2022-april-29th

    హైదరాబాద్లో కరోనా కేసులు భారీగా నమోదువుతుండగా కొంతమంది దర్శక, నిర్మాతలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగులు చేస్తున్నారు. అయితే ఇదే వారి కొంప ముంచినట్లు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా ఎఫ్-3 షూటింగ్ హైదరాబాద్లో వేసిన ఓ సెట్లో జరుగుతోంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో ముందుగానే హీరో వెంకటేష్ షూటింగ్ కు ఉమ్మా కొట్టి సేఫ్ అయ్యారు.

    వెంకటేష్ లేకుండా మిగిలిన పాత్రలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను దర్శకుడు చిత్రీకరిస్తున్నాడు. అయితే ఇటీవల టాలీవుడ్లోని సెలబెట్రీలు ఎక్కువగా కరోనా బారిన పడటంతో ముందు జాగ్రత్తగా ఎఫ్-3 షూటింగులోని పాల్గొనే వారికి కరోనా టెస్టులు నిర్వహించారు. వీరిలో ఏకంగా 20మంది కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో ఉన్న ఫళంగా షూటింగును వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

    మరోవైపు టాలీవుడ్ సెలబ్రెటీలంతా కరోనా బారిన పడుతుండటంతో ఇండస్ట్రీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ లిస్టులో సూపర్ స్టార్ మహేష్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ త్రిష, లక్ష్మీ మంచు,  నిర్మాత బండ్ల గణేష్, ప్రముఖ నటులు సత్యరాజ్, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి శోభన వంటి వారున్నారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసోలేషన్లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు.