Chiranjeevi- Balakrishna: వచ్చే సంక్రాంతికి సినిమాల మధ్య పోరు గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండస్ట్రీ ఉద్దండులు చిరు, బాలయ్య సినిమాలు బిగ్ ఫెస్టివెల్ కు రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మరి కొన్ని సినిమాలు జనవరి మధ్యలో రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే బాలయ్య, చిరు ల సినిమాలకు రావాల్సిన థియేటర్లు దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాతలు ముందే బక్ చేసుకుంటున్నారట. అదీ ఓ తమిళ డబ్బింగ్ సినిమాకోసమని అంటున్నారు. దీంతో నేరుగా తెలుగు సినిమాలకు కాకుండా డబ్ సినిమాల కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదని స్టార్ హీరోల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రకరకాల పోస్టులు పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ తరువాత మెగాస్టార్ నటించిన ఈ మూవీ లుక్ ఇప్పటికే రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అయ్యాయి. అటు బాలకృష్ణ అఖండ ఊపుతో ‘వీర సింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా బాలయ్య ప్రత్యేకంగా కలుగజేసుకొని సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుబడడంతో అప్పుడే డేట్ ఫిక్స్ చేశారు. దీంతో ఇంతకాలం ఈ రెండు సినిమాల మధ్యే ప్రధాన పోరు ఉంటుందని అనుకున్నారు.
కానీ తమిళ డబ్ సినిమా ‘వారసుడు’ కూడా పోటీపడబోతుంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్. నిర్మాత దిల్ రాజు. తన సినిమాల కోసం థియేటర్లను ముందే బుక్ చేసుకోవడంలో దిల్ రాజు దిట్ట. ‘వారసుడు’ సినిమాను దిల్ రాజు తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. అయితే దీనిని సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఇప్పటికే నైజాం, ఆంధ్రాలో చాలా వరకు థియేటర్లు తీసుసుకున్నాడు. దీంతో చిరు, బాలయ్య సినిమాలకు థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడింది.

ఇక ఇరు స్టార్ల ఫ్యాన్ష్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలెట్టేశారు. రూ.60 నుంచి 70 కోట్ల సినిమాల కంటే రూ.9 కోట్ట సినిమాలు ఎక్కువా..? అని దిల్ రాజును ప్రశ్నిస్తున్నారు. ఒక తమిళ డబ్ సినిమా ను తీసుకొచ్చి నేరుగా తెలుగులో వచ్చే సినిమాలకు గండికొడుతారా..? అని అంటున్నారు. అయితే ఈ వార్ అప్పటి వరకు కొనసాగితే ఇండస్ట్రీ షేక్ అయ్యే అవకాశం ఉంది. మరి చిరు, బాలయ్యలు ఈ విషయంపై స్పందిస్తారా..? లేదా..? అనేది చూడాలి.