Director Teja son Amitov: ప్రముఖ స్టార్ డైరెక్టర్ తేజ(Director Teja) కొడుకు అమితోవ్ తేజ(Amitov teja) ఈమధ్య కాలం లో వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన తనని ఒక జంట, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పడుతాను అంటూ డబ్బులు తీసుకొని మోసగించారని పోలీస్ స్టేషన్ లో కేసు వేసిన సంఘటన సంచలనం గా మారింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయనపై కేసు నమోదు అయ్యింది. బెదిరించి డబ్బులు తీసుకున్నాడు అనే ఆరోపణలతో పాటు, కిడ్నాప్, అక్రమ నిర్బంధం, మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలపై కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు అమితోవ్ తేజ్ పై కేసులు నమోదు చేశారు. పోలీసులు ఈ కేసు విషయం లో అందించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లోని మోతి నగర్ ప్రాంతానికి చెందిన కె ప్రణీత్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల పర్యవేక్షణ చేస్తుంటాడు. ఇతనితో అమితోవ్ తేజ కి గత ఏడాది క్రెడిట్ కార్డు దరఖాస్తు విషయం లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దిరోజులకు అమితోవ్ తేజ, ప్రణీత్ మరియు ప్రణీత్ భార్య కలిసి స్టాక్ మార్కెట్ లో ఒక కొత్త అకౌంట్ ని తెరిచి ట్రేడింగ్ చేశారు. అమితోవ్ తేజ తరుపున ప్రణీత్ ట్రేడింగ్ చేయడం వల్ల దాదాపుగా 11 లక్షల రూపాయిల వరకు నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని పూడ్చడానికి అమితోవ్ తేజ్ మరికొంత డబ్బు ట్రేడింగ్ లో పెట్టాలని తీవ్రమైన ఒత్తిడి చేశాడట. అందుకు ప్రణీత్ ఒప్పుకోకపోవడం తో అమితోవ్ తేజ్ తన అనుచరులతో అక్రమంగా అతన్ని నిర్బంధించారు. ఖాళీ పేపర్లు, చెక్కులపై అమితోవ్ తేజ్ అనుచరులు బలవంతంగా ప్రణీత్ చేతితో సంతకాలు చేయించారు. అతని భార్య కూడా భయం తో సంతకాలు చేయాల్సి వచ్చింది.
ఈ వ్యవహారం పై ప్రణీత్ రెండు నెలల క్రితమే నాంపల్లి హైకోర్టు ని ఆశ్రయించాడు. అతని పిటీషన్ పై విచారణ చేపట్టిన నాంపల్లి హైకోర్టు ప్రణీత్ పై కేసు నమోదు చెయ్యాలంటూ జూబ్లీ హిల్స్ పోలీసులకు నిన్న ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. 20 రోజుల క్రితమే అమితోవ్ తేజ్ తనని ప్రణీత్, అతని భార్య ట్రేడింగ్ పేరుతో 72 లక్షల రూపాయిలు మోసం చేసారంటూ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎవరిని అయితే ఆయన ఆరోపిస్తూ కేసులు నమోదు చేసాడో, ఇప్పుడు వాళ్ళే అమితోవ్ తేజ్ పై కేసులు నమోదు చేయడం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం లో ఇంకెన్ని మలుపులు రాబోతున్నాయో చూడాలి.