MLA Arava Sridhar illicit affairs: రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సాగించిన రాస లీలల వ్యవహారంలో కొత్త కొత్త కోణాలు బయట పడుతున్నాయి. బాధితురాలు సోషల్ మీడియాలో నిత్యం సంచలన వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో శ్రీధర్ వ్యవహారం మరింత జటిలంగా మారుతోంది. ఈ వ్యవహారంలో ఇంకా ఎన్ని వీడియోలు బయటకు వస్తాయని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
శ్రీధర్ వ్యవహారం సాగించిన మహిళతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మంతనాలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సదరు మహిళ కల్పిన తర్వాత సీఎం ఒకసారిగా రివర్స్ అయింది. దీంతో ఆమె తన మధ్య సాగిన వ్యవహారాలకు సంబంధించి సంచలన విషయాలను మీడియా ఎదుట బయట పెట్టింది. దీంతో శ్రీధర్ వ్యవహారం ప్రపంచానికి తెలిసింది. అయితే జనసేన పార్టీకి చెందిన ఒక నాయకుడు బాధితురాలైన మహిళతో సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తోంది. అయితే వీటిపై ఆ మహిళలకు నమ్మకం లేకపోవడంతో.. అసలు విషయాలను ఆమె బయట పెట్టింది.
తాజాగా ఆ మహిళ బయటపెట్టిన వీడియోలో ఎమ్మెల్యే శ్రీధర్ ఒంటరిగా కారు తోలుతూ వెళ్తున్నారు. ఆ మహిళకు వీడియో కాల్ చేశారు. నువ్వు నన్ను వద్దనుకుంటే మాత్రం చచ్చిపోతాను.. నువ్వు లేకపోతే నేను బతకలేను అంటూ ఎమ్మెల్యే ఆ వీడియో కాల్ లో అన్నారు. దీంతో ఇంకా ఎన్ని చిత్రాలు ఈ వ్యవహారంలో బయటకు వస్తాయోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.
బాధిత మహిళ బయటికి రావడంతో ఎమ్మెల్యే అజ్ఞాతవానికి వెళ్లిపోయారు. అయితే ఆ వీడియోలు తనవి కావని పేర్కొన్నారు. ఆ వీడియోలలో ఉన్నది తను కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే ఎక్కడ ఉండి వివరణ కూడా ఇచ్చారు. ఈ ఘటన జరిగి దాదాపు మూడు రోజులు కావస్తున్నప్పటికీ ఇంతవరకు ఎమ్మెల్యే జాడ కనిపించలేదు. మరోవైపు ఎమ్మెల్యే నియోజకవర్గంలో లేకపోవడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి. సమస్యల పరిష్కారానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఇక ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే తల్లి ప్రమీల ప్రవేశించారు. డబ్బుల కోసం తన కుమారుడని ఆ యువతి బ్లాక్మెయిల్ చేస్తుందని ఆరోపించారు. 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ప్రమీల విలేకరుల ఎదుట వాపోయారు. అంతేకాదు రైల్వేకోడూరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై సీఐ చంద్రశేఖర్ ఆ మహిళపై నాన్ వెలబుల్ కేసు నమోదు చేశారు. విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు. అయితే ఆ మహిళ అందుబాటులో లేదని.. నోటీసు ఇచ్చామని.. విచారణ కూడా జరుపుతామని పేర్కొన్నారు. మరోవైపు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు పై ఇంతవరకు పోలీసులు కేసు నమోదు కాకపోవడం విశేషం..