
‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో సినిమా ఎనౌన్స్ చేసినప్పుడే జూన్ రెండో వారం నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాం అంటూ ప్రకటించింది నిర్మాణ సంస్థ. అయితే ఇప్పుడు జూన్ రెండో వారం నుంచి షూటింగ్ మొదలయ్యేలా పరిస్థితులు లేవు. కరోనా సెకెండ్ వేవ్ అందరి ప్లాన్స్ ను పూర్తిగా తారుమారు చేసింది. అన్నిటికీ మించి తారక్ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఇంకా డేట్స్ కేటాయించాల్సి ఉంది.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. కాబట్టి ఎన్టీఆర్ – కొరటాల సినిమా బాగా లేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోపక్క దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ను ఇంకా పూర్తి చేయలేదు. ఆచార్య క్లైమాక్స్ ను ఇంకా షూట్ చేయాల్సి ఉంది. అలాగే ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. రిలీజ్ సమయంలో ప్రమోషన్స్ ను భారీగా చేయాల్సి వస్తోంది.
ఈ లెక్కన ఎన్టీఆర్ ఫ్రీ అయినా, కొరటాల ఖాళీ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే కేసుల ఉధృతి తగ్గితేనే మెగాస్టార్ తన ‘ఆచార్య’ షూటింగ్ మొదలు పెడతాడు. మరో మూడు నెలలు సెకెండ్ వేవ్ ప్రభావం ఉండనుంది. కాబట్టి కచ్చితంగా ఎన్టీఆర్ – కొరటాల సినిమా ఇక ఈ ఏడాది లేనట్టే. వచ్చే సంక్రాంతికి గ్రాండ్ గా ఓపెన్ చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్రస్తుతానికి కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.
అయితే ఏప్రిల్ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్, ఇప్పటికే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేశారు. ప్రస్తుతం నడుస్తోన్న కరోనా సెకెండ్ వేవ్ కి ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కూడా మారడం ఖాయంలా కనిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.