https://oktelugu.com/

ANR Statue Inauguration: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఏఎన్నార్ విగ్రహ ఆవిష్కరణ!

మహేష్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. ఏఎన్నార్ కి నివాళులు అర్పించారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు, హీరో రామ్ చరణ్, హీరో నాని, వెంకటేష్ తో పాటు పలువురు ప్రముఖులు ఏఎన్నార్ శతజయంతి వేడుకకు హాజరయ్యారు.

Written By:
  • Shiva
  • , Updated On : September 20, 2023 / 12:51 PM IST

    ANR Statue Inauguration

    Follow us on

    ANR Statue Inauguration: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుగుతున్నాయి. నాగార్జున ఈ మేరకు భారీ ఏర్పాట్లు చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఏఎన్నార్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ జరిగింది. ఏఎన్నార్ కుటుంబ సభ్యులు, చిత్ర ప్రముఖులు ఏఎన్నార్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

    మహేష్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. ఏఎన్నార్ కి నివాళులు అర్పించారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు, హీరో రామ్ చరణ్, హీరో నాని, వెంకటేష్ తో పాటు పలువురు ప్రముఖులు ఏఎన్నార్ శతజయంతి వేడుకకు హాజరయ్యారు. సుదీర్ఘకాలం కళామతల్లికి సేవలు అందించిన లెజెండ్ ని స్మరణం చేసుకుంటున్నారు.

    టాలీవుడ్ కి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు అంటారు. ఎన్టీఆర్ మాస్ కమర్షియల్ హీరోగా ఎదిగితే ఫ్యామిలీ, రొమాంటిక్ లవ్ ఎంటెర్టైనర్స్ తో ఏఎన్నార్ ఆయనకు పోటీ ఇచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమను పుంతలు తొక్కించారు. 90 ఏళ్లకు పైగా జీవించిన ఏఎన్నార్ కన్నుమూసే వరకు నటించారు. ఆయన చివరి చిత్రం మనం.

    మూడు తరాల అక్కినేని హీరోలు కలిసి నటించిన మనం బ్లాక్ బస్టర్ హిట్. దర్శకుడు విక్రమ్ కే కుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లే, స్టోరీతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఏఎన్నార్, నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రలు చేశారు. అఖిల్ సైతం గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. 1923 సెప్టెంబర్ 20న జన్మించిన ఏఎన్నార్ శతజయంతి నేడు. నాగార్జున తండ్రి శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.