Choutuppal: ప్రస్తుతం చాలా మంది నగరాలకు వలస వెళ్తున్నారు. గతం నుంచే ఉపాధి నిమిత్తం నగరాలకు చేరుకోవడం కామనే. కానీ ఈ మధ్య ఈ వలసలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో వలసలతో ఇళ్లన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ఖాళీ ఇళ్లే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో జాతీయ రహదారులపై ఉన్నపట్టణాల పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. ఎటు చూసినా టు లెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.
మండలాలకు కేంద్రంగా ఉంటున్న పట్టణాల్లో చౌటుప్పల్ ఒకటి. ఈ పట్టణంలో మరో నాలుగు గ్రామాలు కలియడంతో పట్టణ జనాభా పెరిగింది. పట్టణం కూడా విస్తరించింది. కానీ అందరు హైదరాబాద్ నగరానికి వలస వెళ్లడంతో ఇళ్ల ముందు టు లెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీగా మారిన చౌటుప్పల్ దినదినం అభివృద్ధి చెందుతోంది.
చౌటుప్పల్ నగరానికి దగ్గరగా ఉండటంతో కూడా ఎక్కువగా విస్తరిస్తోంది. అద్దెకు వచ్చే వారి అభిరుచుల మేరకు గదులు నిర్మిస్తున్నారు. ఒక్కో గదికి రూ. 1000 నుంచి 2000 వరకు అద్దె విధిస్తున్నారు. సింగిల్ బెడ్ రూంకు రూ. 5 వేల నుంచి 8 వేల వరకు ఉంటున్నాయి. రూ. లక్షలు వెచ్చించి చేపట్టిన నిర్మాణాల వల్ల వచ్చే అద్దెలపై అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
రెండు దశాబ్ధాల కాలంలో పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పట్టణంలో అద్దెల బోర్డులు ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ అద్దెకు వచ్చే వారు కరువయ్యారు. నెలల తరబడి బోర్డులు అలాగే ఉంటున్నాయి. ఎవరు వచ్చేది లేదు. అద్దె వచ్చిన సందర్భాలు ఓనర్లకు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యలో చౌటుప్పల్ వాసుల కల తీరేనా? అనేది సందిగ్ధమే.