Raj Tarun: రాజ్ తరుణ్ – లావణ్య ప్రేమ వ్యవహారం గత కొంతకాలం నుండి మీడియా లో ఎంత హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అయ్యిందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రతీ రోజు న్యూస్ చానెల్స్ లో వీళ్లకు సంబంధించిన డిబేట్స్ జరుగుతూ ఉండేవి. రాజ్ తరుణ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఆమెతో రిలేషన్ మైంటైన్ చేసిన విషయం వాస్తవమే అని, కానీ ఆమె ప్రవర్తన కారణంగా, ఆమె డ్రగ్స్ కి అడిక్ట్ అవ్వడం వల్ల ఆమెని వదిలేయాల్సి వచ్చిందని రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారంలో ఏమాత్రం వెనకడుగు వేయని లావణ్య, నాకు నా రాజ్ కావాలి అంటూ మీడియా ముందుకొచ్చి రచ్చ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాజ్ తరుణ్ పైన ఆమె పోలీస్ కేసు కూడా నమోదు చేసింది. ఈ కేసు విషయంలో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కూడా దక్కించుకున్నాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ కేసు విషయం లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పలు కీలకమైన వ్యాఖ్యలు చేసారు. గత కొద్దిరోజులుగా లావణ్య – రాజ్ తరుణ్ కలిసి ఉంటున్న నివాసం చుట్టుపక్కల విచారించమని, లావణ్య మాట్లాడిన మాటలన్నీ వాస్తవమే అని, వాళ్లిద్దరూ కలిసి 10 సంవత్సరాలు గా ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. అందుకు సంబంధించి కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించామని ఈ సందర్భంగా పోలీసులు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు నేడు రాజ్ తరుణ్ ని నిందితుడిగా పరిగణించి ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. ఈ వ్యవహారం లో వచ్చిన ఈ కీలక ట్విస్ట్ ఇప్పుడు రాజ్ తరుణ్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే పదేళ్లు వాళ్ళు కలిసి ఉన్నారనే విషయం రాజ్ తరుణ్ కూడా ఒప్పుకున్నాడు. ఆమెని భరించలేకనే విడిపోయానని చెప్పుకొచ్చాడు, మరి పోలీసులకు కొత్తగా దొరికిన సాక్ష్యాలు ఏమిటి అనేది తెలియట్లేదు.
లావణ్య డ్రగ్స్ కేసు లో అరెస్ట్ అయినప్పటి నుండి రాజ్ తరుణ్ ఆమెకి దూరంగా ఉంటూ వచ్చాడని లావణ్య పలు డిబేట్స్ లో చెప్పుకొచ్చింది. నేను జైలు నుండి బయటకి రాగానే రాజ్ తరుణ్ నాకు అండగా నిలబడతాడు అనుకుంటే, తనని ఏకాకి ని చేసి వెళ్ళిపోయాడు అంటూ ఆమె మాట్లాడిన మాటలు అప్పట్లో తెగ వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా ఈ వ్యవహారం లోకి తలదూర్చి లావణ్య గుట్టు మొత్తం రట్టు చేసిన శేఖర్ బాషా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. శేఖర్ బాషా తలదూర్చడం వల్లే ఈ వివాదం పై మీడియా లో డిబేట్స్ బాగా తగ్గాయి. ఒక లైవ్ డిబేట్ లో లావణ్య శేఖర్ బాషా పై చెప్పు విసిరిన ఘటన ఎంతటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే. అయితే నేడు లావణ్య కి అనుకూలంగా పోలీసుల నుండి తీర్పు రావడం ఆమెకి కొంతవరకు ఊరట లభించినట్టు అయ్యింది.