https://oktelugu.com/

Ganesh Chaturthi 2024: దేశంలోనే అత్యంత సంపన్న గణేషుడు ఎవరు? ఆయన ఎక్కడున్నాడో తెలుసా?

వినాయక చవితి వచ్చిదంటే లక్షలాది గణనాథుడి విగ్రహాలతో యావత్‌ భారతదేశం కళకళలాడిపోతుంది. మనకు ఖైరతాబాద్‌ గణేష్‌ ఫేమస్‌ అయితే ముంబైలో లాల్‌బౌగ్చా మహరాజ్‌ ఫేమస్‌. అయితే భారత్‌లోనే అత్యంత సంపన్న గణనాథుడి విగ్రహం కూడా ముంబైలోనే ఉంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 6, 2024 / 04:23 PM IST

    Ganesh Chaturthi 2024

    Follow us on

    Ganesh Chaturthi 2024: వినాయకచవితి వేడుకలు దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. శనివారం(సెప్టెబర్‌ 7న) వినాయక చవితి ఉండడంతో అందరూ మండపాలను సిద్ధం చేస్తున్నారు. విగ్రహాలను తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా వైభవంగా వేడుకలు జరుగనున్నాయి. డిఫ్రెంట్‌ థీమ్స్‌తో వినాయకులను ఈసారి ప్రతిష్టించబోతున్నారు. తొమ్మిది రోజులపాటు గణనాథుడిని ఘనంగా కొలవనున్నారు. అయితే వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చే గణనాథుడు ఒక్కో మండపంలో ఒక్కోలా కొలువుదీరబోతున్నారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్ని విగ్రహాలు కొలువుదీరినా ఇప్పుడు చెప్పుకోబోయే వినాయకుడి దేశంలోనే అత్యంత సంపన్నమైన గణపతి. ఈ గణపతికి ఇన్సూరెన్స్‌ కూడా చేస్తారట. ఇంతకీ ఆ గణనాథుడు ఎవరు.. ఎక్కడ ప్రతిష్టిస్థారు. అంత కాస్ట్‌లీ ఎందుకు అనే వివరాలు తెలుసుకుందాం.

    దేశంలో ఇతర చోట్ల కన్నా ముంబై గణపతులు ఎప్పుడూ స్పెషలే. ఇక్కడ మెయిన్‌ లాల్‌ బాగ్చా గణపయ్య, గురించి మనం మెయిన్‌గా వింటూనే ఉంటాం. ఈయనను ముంబైకా రాజా అని కూడా పిలుస్తారు. రాజకీయనాయకులు, యాక్టర్స్, పలు రంగాలలోని దిగ్గజాలు అందరు కూడా గణపయ్య నవరాత్రులలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ క్రమంలో.. జీఎస్‌బీ సేవా మండల్‌ గణేశోత్సవంలో అత్యంత ధనిక గణేశ విగ్రహంగా గుర్తింపు పొందింది. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జీఎస్‌బీ సేవా మండల్‌ మహాగణపతిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఏడాది మహాగణపతిని 66.5 కిలోల బంగారు ఆభరణాలు, 325 కిలోల వెండి, ఇతర విలువైన ఆభరణాలతో అలంకరింస్తారట. గతేడాది 295 కిలోల వెండి, ఇతర ఆభరణాలు అలంకరించారు. ఈసారి వెండి ఆభరణాలు మరో 30 కిలోలు పెంచారు.

    పటిష్ట భద్రత..
    భక్తుల భద్రత దృష్ట్యా సేవా మండల్‌ తొలిసారిగా అన్ని ప్రదేశాలలో ఫేషియల్‌ రికగ్నిషన్‌ కెమెరాలను ఏర్పాటు చేసింది. జీఎస్‌బీ సేవా మండల్‌ మాట్లాడుతూ ఈ ఏడాది రూ.400.58 కోట్ల బీమా రక్షణను తీసుకున్నామన్నారు. మరోవైపు భక్తులను దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు క్యూఆర్‌ కోడ్‌లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ ఏర్పాటు చేశారు. బీఎస్‌బీ గణనాథునికి అనంత్‌ అంబాని 25 కిలోల బంగారు కిరీటం బహూకరించారు.

    ప్రత్యేక ఏర్పాట్లు..
    ఇక జీఎస్‌బీ గణనాథుడి భద్రత కోసం ఏటా సిబ్బందిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. భక్తుల రద్దీని బట్టి భద్రత సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా సీసీ కెమెరాలో అధికారులు నిరంతరం అలర్ట్‌గా ఉంటారు. భక్తులను పూర్తిగా చెక్‌ చేసిన తర్వాతనే స్వామి వారి దర్శనానికి అనుమతి ఇస్తారు. ప్రత్యేకంగా మెటల్‌ డిటెక్టర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. సీసీ కెమెరాలలో నిరంతరం రాకపోకలను ఒక కంట కనిపెడుతునే ఉన్నారు.