Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుంది. కేవలం 14 మంది కంటెస్టెంట్స్ తో లేటెస్ట్ సీజన్ మొదలైంది. మొదటి వారం సోషల్ మీడియా స్టార్ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. బేబక్క నిష్క్రమణతో హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. రెండో వారం ఎలిమినేషన్ కి 8 మంది నామినేట్ అయ్యారు. విష్ణుప్రియ, నాగ మణికంఠ, నిఖిల్, శేఖర్ బాషా, సీత, నైనిక, ఆదిత్య ఓం, పృథ్వి రాజ్ నామినేషన్స్ లిస్ట్ లో ఉన్నారు. వీరిలో ఒకరు నెక్స్ట్ సండే ఇంటిని వీడనున్నారు.
ఓటింగ్ సరళి ఎలా ఉంది? ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది? అని పరిశీలిస్తే… తాజా ఓటింగ్ ప్రకారం విష్ణుప్రియ టాప్ లో ఉందట. విష్ణుప్రియ టాప్ సెలెబ్. మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే ఆమెకు ఫేమ్ ఎక్కువ. సోనియా ఆమె పై చేసిన కామెంట్స్ సైతం ప్లస్ అయ్యాయి. విష్ణుప్రియకు ప్రేక్షకుల్లో మైలేజ్ పెరిగింది. దాంతో ఆమెకు అధిక శాతం ఓట్లు పోల్ అవుతున్నాయట.
తర్వాత స్థానంలో నిఖిల్ ఉన్నాడట. సీరియల్ నటుడు నిఖిల్ కి బుల్లితెర ఆడియన్స్ లో ఫేమ్ ఉంది. అదే సమయంలో అతడు గేమ్ పరంగా కూడా పర్లేదు. రెండో స్థానంలో నిఖిల్ ఉన్నారట. ఇక స్వల్ప ఓట్ల తేడాతో నాగ మణికంఠ మూడో స్థానంలో, నైనిక నాలుగో స్థానంలో ఉన్నారట. నాగ మణికంఠ సింపతీ ప్లాన్ వర్క్ అవుట్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. మెల్లగా అతని గేమ్ కూడా మెరుగవుతుంది.
శేఖర్ బాషా ఐదో స్థానంలో కొనసాగుతున్నాడట. ఇక ఆరో స్థానంలో ఆదిత్య ఓం ఉన్నట్లు సమాచారం. ఆదిత్య ఓం ఫేమ్ ఉన్న నటుడు అయినప్పటికీ గేమ్ పరంగా వెనుకబడ్డాడు. భాష రాకపోవడం కూడా అతడికి మైనస్ అని చెప్పొచ్చు. ఈ కారణాలతో ఆదిత్య ఓం ఓటింగ్ ఓ వెనకబడ్డారు. ఇక చివరి రెండు స్థానాల్లో పృథ్విరాజ్, కిరాక్ సీత ఉన్నారని సమాచారం.
నాగ మణికంఠ, ఆదిత్య ఓం లతో పోల్చుకుంటే వీరిద్దరూ స్ట్రాంగ్ ప్లేయర్స్. ఫేమ్ ఉన్న సెలెబ్స్ కూడాను. అయినప్పటికీ వీరికి తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆదిత్య ఓం, పృథ్విరాజ్, కిరాక్ సీతలలో ఒకరు ఎలిమినేట్ కావచ్చని తాజా ఓటింగ్ సరళి ద్వారా అర్థం అవుతుంది. ఇంకా ఓటింగ్ కి సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరు ఎలిమినేట్ అవుతారని చెప్పలేం.