Trivikram viral scenes: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. కెరియర్ స్టార్టింగ్ లో రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన తక్కువ సమయంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే టాప్ రైటర్ గా ఎదిగాడు.
Also Read: రజినీకాంత్ తో సినిమా చేయాలని ట్రై చేసిన తెలుగు స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
త్రివిక్రమ్ డైరెక్షన్ చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం విశేషం… ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను అలాగే యూత్ ను అట్రాక్ట్ చేసిన సినిమాలే కావడం విశేషం… ఈయన సినిమాల్లో కామన్ గా కనిపించే ఒకే ఒక పాయింట్ ఏంటంటే హీరో ఒక చోటు నుంచి మరొకరి ఇంటికి గెస్ట్ గానో, లేదంటే ఏదైనా ప్రాబ్లం ను సాల్వ్ చేయడానికో వెళుతూ ఉంటాడు. ముఖ్యంగా నువ్వే నువ్వే సినిమాను తీసుకుంటే శ్రేయ అన్నవరం వెళ్ళినప్పుడు వాళ్ళను వెతుకుతూ వాళ్ళ ఇంటికి వెళుతాడు. అలాగే అతడు సినిమాలో నందు (మహేష్ బాబు) క్యారెక్టర్ పార్ధు వాళ్ళ ఇంటికి వెళ్తాడు… ఇక జల్సా సినిమాలో భాగీ (ఇలియానా) సంజయ్ సాహు (పవన్ కళ్యాణ్) వాళ్ళ ఇంటికి వెళ్తుంది… ఖలేజా సినిమాలో మహేష్ బాబు దిలావర్ సింగ్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్తాడు… జులాయి సినిమాలో అల్లు అర్జున్ రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తాడు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఉంటాడు… సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అల్లు అర్జున్ ఉపేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటాడు… అ ఆ సినిమాలో నితిన్ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు…
‘అజ్ఞాతవాసి‘ సినిమాలో అతన్ని వారసుడిగా ప్రకటించే దాకా ఎప్పుడెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అనే ప్రయత్నం చేస్తాడు…’అలా వైకుంఠపురంలో‘ సినిమాలో అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు… ‘గుంటూరు కారం‘ సినిమాలో మహేష్ బాబు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తాడు…
ఇలా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ప్రతి సినిమాలో హీరో ఎవరో ఒకరి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. వీలైతే ఆ ఇంట్లో కొన్ని రోజులు ఉండి అక్కడ పరిస్థితులను బాగు చేసి వాళ్ళను మారుస్తాడు. త్రివిక్రమ్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా ఒకే టెంప్లేట్ లో ఉండడం విశేషం…
ఇక ఈయన చేసిన కొన్ని సినిమాలు వేరే జానర్ లో ఉన్నప్పటికి ఈయన ఎలాంటి సినిమాలు చేసిన హీరో వేరే వల్ల ఇంటికి వెళ్ళే సీన్ పక్కాగా ఉంటుంది అంటూ ప్రస్తుతం ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇక జనాలు సైతం త్రివిక్రమ్ ను ట్రోల్ చేస్తున్నారు…