https://oktelugu.com/

Devara Movie : ప్రపంచం లోనే 2వ స్థానం లో ‘దేవర’..నందమూరి ఫ్యాన్స్ జీవితాంతం కాలర్ ఎగరేసుకునే రికార్డు!

ఎన్టీఆర్ కేవలం ఓపెనింగ్స్ తో సరిపెట్టలేదు, లాంగ్ రన్ లో కూడా అదే దూకుడుని కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది 'కల్కి' చిత్రం తప్ప చిన్న సెంటర్స్ నుండి పెద్ద సెంటర్స్ వరకు మంచి వసూళ్లను రాబట్టిన సినిమా రాలేదు. ముఖ్యంగా C సెంటర్స్ లో ఉండే థియేటర్స్ ని నడపలేక, మూసివేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 08:33 PM IST

    Devara Movie collections

    Follow us on

    Devara Movie :  ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతీ రోజు రాబడుతున్న వసూళ్లను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పాన్ ఇండియన్ డైరెక్టర్ సపోర్టు లేనిదే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మొదటి రోజు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు పెట్టలేకపోతున్న రోజులివి. అలాంటిది ఎన్టీఆర్ ఒక మామూలు టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ తో ఏకంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎన్టీఆర్ ఓపెనింగ్స్ లో కింగ్ అని అందరికీ తెలుసు కానీ, ప్రభాస్, రజినీకాంత్ రేంజ్ లో పాన్ ఇండియన్ ఓపెనింగ్ పెట్టగలడా అనే అనుమానం ఉండేది. కానీ ఎన్టీఆర్ కేవలం ఓపెనింగ్స్ తో సరిపెట్టలేదు, లాంగ్ రన్ లో కూడా అదే దూకుడుని కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘కల్కి’ చిత్రం తప్ప చిన్న సెంటర్స్ నుండి పెద్ద సెంటర్స్ వరకు మంచి వసూళ్లను రాబట్టిన సినిమా రాలేదు. ముఖ్యంగా C సెంటర్స్ లో ఉండే థియేటర్స్ ని నడపలేక, మూసివేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.

    కానీ ‘దేవర’ చిత్రం విడుదల తర్వాత మునుపటి వైభోగం బాక్స్ ఆఫీస్ వద్ద మళ్ళీ చూస్తున్నారు ట్రేడ్ పండితులు. అనేక ప్రాంతాలలో పెట్టిన డబ్బులకు కేవలం రెండు, మూడు రోజుల్లోనే రాబడిని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టారు బయ్యర్స్. అలాంటి వసూళ్ల సునామి సృష్టించిన ఈ చిత్రం ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ‘దేవర’ కి వస్తున్న వసూళ్లు ఏ సినిమాకి కూడా రావడం లేదు. రీసెంట్ గానే హాలీవుడ్ లో ‘ది వైల్డ్ రోబో’ అనే చిత్రం విడుదలై మంచి రివ్యూస్ ని దక్కించుకుంది. గత వారం విడుదలైన ఈ సినిమాకి మొదటి వారం లో 44 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. ‘దేవర’ చిత్రానికి వచ్చిన వసూళ్లను అమెరికన్ డాలర్స్ లెక్కలోకి వేస్తే 33 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

    విడుదలై ఇంకా పూర్తి వారం కూడా అవ్వలేదు, అప్పుడే ఈ చిత్రానికి ఈ రేంజ్ ట్రెండింగ్ ఉండడం మామూలు విషయం కాదు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ‘ది వైల్డ్ రోబో’ తర్వాత అత్యధిక వసూళ్లతో రెండవ స్థానం లో ట్రెండ్ అవుతున్న చిత్రం ‘దేవర’ నే. ఇదొక అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చు. నందమూరి అభిమానులు జీవితాంతం ఈ రికార్డు ని చెప్పుకొని కాలర్ ఎగరేయొచ్చు. ఇది ఇలా ఉండగా నేడు నేషనల్ హాలిడే అవ్వడం తో ఈ సినిమాకి మళ్ళీ వసూళ్లు పుంజుకున్నాయి. తెలుగు వెర్షన్ లో మాత్రమే కాదు, హిందీ వెర్షన్ లో కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.