https://oktelugu.com/

Good news for car buyers : కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. పండుగ సీజన్ కు 3 కొత్త కార్లు.. వాటి ధరలు ఎలా ఉన్నాయంటే?

సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పండుగల సీజన్ అంటారు. 2024 సెప్టెంబర్ నుంచి పండుగల సీజన్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే దసరా, దీపావళి సందర్భంగా కొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశం పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి వివరాల్లోకి వెళితే.

Written By:
  • Srinivas
  • , Updated On : October 2, 2024 / 08:23 PM IST

    Good news for car buyers

    Follow us on

    Good news for car buyers : శ్రావణ మాసం రాగానే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇప్పటి నుంచి పండుగలు, వ్రతాలు ప్రారంభం అవుతాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించడానికి శుభముహూర్తాలు కూడా ఉంటాయి. ఇదే సమయంలో కొందరు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఆటోమోబైల్ కు చెందిన కార్ల కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తాయి. కార్లు కొనాలనుకునే వారు పండుగల సందర్భంగా కొత్త వెహికల్ ను తీసుకోవాలనుకుంటారు. అందుకే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పండుగల సీజన్ అంటారు. 2024 సెప్టెంబర్ నుంచి పండుగల సీజన్ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే దసరా, దీపావళి సందర్భంగా కొన్ని కంపెనీలు కొత్త మోడళ్లను ప్రవేశం పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి వివరాల్లోకి వెళితే..

    దక్షిణ కొరియాకు చెందిన కియా కంపెనీ భారత్ లో దూసుకుపోతంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి సెల్టోస్, సోనేట్ కార్లు ప్రత్యేకతను సాధించాయి. ఈ ఏడాది పండుగల సీజన్ సందర్భంగా కొత్త MPVని తీసుకువస్తోంది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో పాటు ఇప్పటి వినియోగదారులకు అనుగుణంగా ఉండే ఫీచర్లను అమరుస్తూ.. కార్నివాల్ ఫేస్ లిప్ట్ ను అక్టోబర్ 3న లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్ లో లభించే అవకాశం ఉంది. దీనిని రూ. 45 లక్షల ప్రారంభ ధరతో విక్రయించే అవకాశం ఉంది. 12.3 అంగుళాల డిస్ ప్లే, పనోరమిక్ సన్ రూఫ్, 8 ఎయిర్ బ్యాగ్స్ తో ఉన్న ఈ కారు 7 లేదా 9 సీట్లను కలిగి ఉంటుంది.

    దేశంలో నిస్సాన్ కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి మాగ్నైట్ ఫేస్ లిప్ట్ ను కొత్తగా లాంచ్ చేయబోతున్నారు. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్విప్ట్, హ్యుందాయ్ ఎక్స్ టర్ కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మోడల్ 1 లీటర్ పెట్రోల్, 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే తో పాటు సింగిల్ ఫేస్ సన్ రూఫ్ నుకలిగిన దీనిని రూ.6.50 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. దీనిని అక్టోబర్ 4న లాంచ్ చేయనున్నారు.

    చైనాకు చెందిన BYD నుంచి ‘ఇమాక్స్ 7’ ఎలక్ట్రిక్ ఎంపీవిని మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఈ కారు కోసం సెప్టెంబర్ 21 నుంచే బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. 6 లేదా 7 సీటర్ కలిగిన ఈ కారు ధర రూ.25 లక్షల నుంచి రూ.33 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. 71.8 కిలో వాట్ బ్యాటరీతో ఉన్న ఈ కారులో 3 స్పోక్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్ రూప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా లగ్జరీ కారు కొనాలని చూసేవారికి బీవైడీ బెస్ట్ ఆప్షన్ అని కొందరు కొనియాడుతున్నారు.