Euphoria Teaser Talk: ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం సమాజానికి ఏదో ఒక రకంగా మెసేజ్ ఇవ్వాలని ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే ఒక్కడు, చూడాలని ఉంది లాంటి గొప్ప సినిమాలను చేసి కష్టపడిగా తనకంటూ ఒక ఐడెంటిటి ని సంపాదించుకున్న గుణశేఖర్ సైతం ఇప్పుడు యుఫోరీయా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిజ ద్వారా యూత్ వ్యసనాలకు ఎలా అలవాటు పడుతున్నారు. వాళ్లు ఏ దారిన వెళ్తున్నారు? దానివల్ల కెరియర్ ఎలా నాశనం అవుతోంది అనేది క్లియర్ కట్ గా చూపించినట్టుగా తెలుస్తోంది. ఇక గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమాను ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో టీజర్ లో యూత్ ను బేస్ చేసుకొని కొన్ని డైలాగ్స్ కూడా వినిపించాయి.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక భూమిక, గౌతమ్ మీనన్ లాంటి పాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన నటుడు కూడా కొత్త కుర్రాడి లానే ఉన్నాడు. కాలేజీ అంటూ నువ్వు దాన్ని చూసుకోవడం వల్లే మన కొడుకు ఇలా మారాడు అంటూ తన భర్త తనను తిట్టే డైలాగ్ టీజర్ లో హైపర్ అయింది… పేరెంట్స్ పిల్లల్ని ఎలా చెడగొడుతున్నారు.
వాళ్ళని అలా గాలికి వదిలేయడం వల్లే వాళ్ళలా ఊరు మీద పడి తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా మందు తాగుతూ డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారనే పాయింట్ ని ఈ సినిమా ద్వారా తెలియజేయాబోతున్నట్టుగా తెలుస్తోంది… ప్రతి పేరెంట్స్ డబ్బుల వెనక పరుగెడుతూ పిల్లలు ఎలా ఉంటున్నారో పట్టించుకోవడం మానేశారు.
అలాంటి పిల్లల వల్ల సమాజం ఎలా నాశనమవుతుంది అనేది ఈ మూవీలో చూపించినట్టుగా తెలుస్తోంది…ఇక టీజర్ ఓకే అనేలా ఉన్నప్పటికి, విజువల్స్ పెర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు. ఇంకొంచెం బ్రైట్ గా పిక్చర్ క్వాలిటీ ఉంటే బాగుండేదేమో…ఇక ఈ సినిమాతో అయిన గుణ శేఖర్ సక్సెస్ ను సాధించి మరోసారి ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
