https://oktelugu.com/

ETV Prabhakar : మెగాస్టార్ చిరంజీవి కారణంగా పస్తులున్న రోజులను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఈటీవీ ప్రభాకర్!

ప్రభాకర్ ఈటీవీ నుండి బయటకి వచేసాడు. పలు టీవీ సీరియల్స్ లో హీరో గా నటించిన ఈయన మంచి పాపులారిటీ ని సంపాదించాడు. దీంతో ప్రభాకర్ ని బుల్లితెర మెగాస్టార్ అని పిలవడం ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన సీరియల్స్ లో కొనసాగుతూనే ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కేవలం నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ప్రభాకర్ రాణించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 23, 2024 / 07:42 PM IST

    ETV Prabhakar

    Follow us on

    ETV Prabhakar : టీవీ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించిన నటులలో ఒకరు ప్రభాకర్. ఇతన్ని అందరూ బుల్లితెర మెగాస్టార్ అని పిలుస్తుండేవారు. ప్రభాకర్ ఎక్కువగా అప్పట్లో ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్స్ షోస్ ద్వారానే పాపులారిటీ ని సంపాదించాడు. అందుకే అందరూ ఈయనని ఈటీవీ ప్రభాకర్ అని పిలుస్తూ ఉంటారు. అంతే కాదు రామోజీ రావు కొడుకు సుమన్ తో ప్రభాకర్ కి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆయనతో బిజినెస్ లో పార్టనర్ గా కూడా ప్రభాకర్ కొనసాగేవాడు. అప్పట్లో ఈటీవీ లో ‘యాహూ’ అనే పాపులర్ ప్రోగ్రాం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు ప్రభాకర్. ఆ తర్వాత ఆయన సుమన్ తో కలిసి ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ లో పెట్టుబడి పెట్టాడు. అయితే బిజినెస్ లో స్నేహితుల మధ్య ఎదో ఒక సందర్భంలో మనస్పర్థలు, గొడవలు రావడం సహజం. అలా ప్రభాకర్ తో సుమన్ కి కూడా గొడవలు ఏర్పడ్డాయి.

    దీంతో ప్రభాకర్ ఈటీవీ నుండి బయటకి వచేసాడు. పలు టీవీ సీరియల్స్ లో హీరో గా నటించిన ఈయన మంచి పాపులారిటీ ని సంపాదించాడు. దీంతో ప్రభాకర్ ని బుల్లితెర మెగాస్టార్ అని పిలవడం ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన సీరియల్స్ లో కొనసాగుతూనే ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. కేవలం నటుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా ప్రభాకర్ రాణించాడు. పలు సీరియల్స్ కి దర్శకత్వం కూడా వహించాడు. రీసెంట్ గానే స్టార్ మాలో ప్రసారమైన డైలీ సీరియల్ ‘కృష్ణ ముకుంద మురారి’ కి నిర్మాతగా వ్యవహరించింది ఈయనే. స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సాధించిన సీరియల్స్ లో ఒకటిగా ఈ సీరియల్ కూడా నిల్చింది. ఈ సీరియల్ లో నటించిన ప్రేరణ, యష్మీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ గా కొనసాగుతున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ‘రామ్ నగర్ బన్నీ’ అనే చిత్రం ద్వారా వెండితెర కి పరిచయం కాబోతున్నారు. అతి త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ప్రభాకర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చిరంజీవి గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

    ఆయన మాట్లాడుతూ ‘ చిన్నప్పటి నుండి నాకు మెగాస్టార్ చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం. ఆయన సినిమా విడుదలైతే మొదటి రోజు మొదటి ఆటలో చూడకపోతే ఎదో పాపం జరిగిపోయింది అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. అలాంటి అభిమానిని అయిన నాకు ఆయన రాజకీయాల్లోకి వెళ్తూ సినిమాలు మానేస్తున్నాడనే విషయం తెలుసుకొని చాలా బాధపడ్డాను. రెండు రోజులు అన్నం కూడా తినలేదు. అలా డీలా పడిన సమయం లో రామ్ చరణ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నాడు విషయం తెలుసుకొని కోలుకున్నాను. ఈరోజు ఆయన తండ్రినే మించిన తనయుడు అయిపోవడం నన్ను ఎంతగానో సంతోషపెట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాకర్.