Uttar Pradesh : గుట్టలు నాశనమయ్యాయి. కొండలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఫలితంగా కొన్ని సంవత్సరాల నుంచి కోతులు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. ప్రతిరోజు కిష్కింధ కాండను సృష్టిస్తున్నాయి. కోతుల బాధ తట్టుకోలేక చాలామంది పొలాలను వదిలిపెడుతున్నారు. తమ ఇళ్లకు రక్షణగా కుక్కలను పెంచుకుంటున్నారు. ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కోతులు కూడా స్వైర విహారం చేస్తున్నాయి. పండ్ల తోటలను నాశనం చేస్తున్నాయి. పంటచేలను విధ్వంసకాండ సృష్టిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే మనుషుల ప్రాణాలను కూడా తీస్తున్నాయి. గ్రామాలలో కొందరైతే వాళ్ల ఇళ్ళను కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కోతులు మంచి పని చేశాయి.. ఒక బాలిక శీలాన్ని రక్షించాయి. ఒక కామాంధుడి చెర నుంచి ఆమెను కాపాడాయి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్ పత్ ప్రాంతంలో జరిగింది.
ఆంజనేయ స్వామి పంపించాడనుకుంటా
దుష్టులను శిక్షించి.. శిష్టులను రక్షించిన ఘనత ఆంజనేయ స్వామి ది. చెడు నుంచి, భయం నుంచి కాపాడే తెగువ ఆంజనేయ స్వామి. ఎలాంటి చెడు కలలు వచ్చినా మనలో చాలామంది హనుమంతుడిని తలుచుకుంటాం. హనుమంతుడు రాముడి భక్తుడు.. రాముడిని కొలిచే భక్తులకు హనుమంతుడు కాపాడుతుంటాడని నమ్మిక.. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం చోటుచేసుకుంది. బాగ్ పాత్ ప్రాంతంలో ఓ యువకుడు ఆరు సంవత్సరాల బాలికతో మాయమాటలు చెప్పి పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె దుస్తులు విప్పి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. తనను తాను కాపాడుకునేందుకు ఆ బాలిక తీవ్రంగా ప్రయత్నించింది. అక్కడ ఉన్న కోతులు వెంటనే ఆ కామాంధుడి పైన పడ్డాయి. అతనిపై దాడి చేశాయి. ఈ క్రమంలో ఆ బాలిక అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళింది.. ఆ తర్వాత ఆ బాలిక ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పుకొని బాధపడింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఆ దృశ్యాలలో ఆ యువకుడు ఆ బాలికను తీసుకెళ్తున్నట్టు కనిపించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు..
హనుమంతుడు రక్షణగా పంపించాడు..
కోతులు తనను కాపాడిన విషయాన్ని ఆ బాలిక తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో వారు ఆంజనేయస్వామి కోతులను తన బిడ్డకు రక్షణగా పంపించాడని ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు.. అయితే ఆ నిందితుడు గతంలో ఆ బాలికను చంపేస్తానని బెదిరించినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో కోతులు అక్కడికి రావడంతోనే నా బిడ్డ బతికి బట్టకట్టిందని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. వెంటనే పోలీసులు ఫోక్సో చట్టం కింద నమోదు చేసి.. విచారణ నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.