https://oktelugu.com/

RRR Flag: “ఎత్తర జెండా” పాటలో ఈ జెండా ని గమనించారా? ఆ జెండా నే ఎందుకు పెట్టారు ? దాని చరిత్ర ఏంటంటే ?

నేషనల్ రేంజ్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ లోకమంతా.. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది, ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులను నెలకొల్పి.. ఏ స్థాయి చరిత్రను సృష్టిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ట్రేడ్‌ పండితులు. ఐతే, ఈ సినిమాలో ‘నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా’ అంటూ సాగే […]

Written By:
  • Shiva
  • , Updated On : April 5, 2022 10:43 am
    Follow us on

    నేషనల్ రేంజ్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా వచ్చిన క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ చూసి భారతీయ సినీ లోకమంతా.. సంతోషంతో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుంది, ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులను నెలకొల్పి.. ఏ స్థాయి చరిత్రను సృష్టిస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ట్రేడ్‌ పండితులు.

    ఐతే, ఈ సినిమాలో ‘నెత్తురు మరిగితే ఎత్తెర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా’ అంటూ సాగే సాంగ్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సాంగ్ లో ఎన్టీఆర్ – చరణ్ ఓ జెండా పట్టుకుని చెరో వైపు నిలబడటం ఆసక్తిని పెంచింది. అయితే, ఎన్టీఆర్ – రామ్ చరణ్ పట్టుకున్న ఈ జెండా వెనుక పెద్ద కథే ఉంది. ఈ జెండా ఈనాటి మన జాతీయ జెండా కాదు.

    RRR

    మన దేశ స్వాతంత్రానికి ముందు నాటి జెండా ఇది. 1907 నాటి కాలానికి చెందినది. 1906లో మన దేశ జెండా పై భాగంలో కాషాయం, కింద భాగంలో ఆకుపచ్చ, మధ్యలో పసుపు రంగులతో ఉండేది. మధ్యలో వందే మాతరం అని హిందీలో అక్షరాలు ఉండేవి. ఆ తర్వాత 1907లో పై భాగంలో ఆకుపచ్చ, కింద భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులలో మార్చి.. మధ్యలో వందే మాతరం అక్షరాలు రాసి ఆ జెండాను మార్చారు.

    Also Read: RRR 10 Days Collections: షాకింగ్.. ఇది తెలుగు వాడి సింహ గర్జన !

    ఆ జెండానే ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్-రామ్ చరణ్ పట్టుకున్నారు. పైగా ఈ జెండా 1907 నుండి 1917 కాలం వరకు భారతీయ జెండాగా ఉంది. ఆ తర్వాత 1917లో బ్రిటిష్ జెండాను పోలిన ఓ జెండాను రూపొందించారు. ఇక స్వతంత్ర అనంతరం అశోక చక్రంతో అధికారికంగా మన జాతీయ జెండా ఆవిష్కృతమైంది. మొత్తానికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో ఎంత గొప్పగా రీసెర్చ్ చేసి ఈ సినిమాని తెరకెక్కించారో చెప్పడానికి ఈ జెండానే నిదర్సనం.

    ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి తెలుగుతో పాటు అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.492 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.500 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఈ సినిమా 10 రోజులకు గానూ అన్ని వెర్షన్లు కలుపుకుని టోటల్ వరల్డ్ వైడ్ గా 494.20 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం తెలుగు సినీ ఇండస్ట్రీకే గర్వకారణం.

    Also Read: RRR 9th Day Collections: రాజమౌళి నీరాజనాలతో బాక్సాఫీస్ చిన్నబోయింది

    Tags