Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు మూవీ టీం. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ని కూడా బయటకు రానివ్వకూడదు అని అనుకున్నారు కానీ, సోషల్ మీడియా కారణంగా అవి లీక్ అయిపోయాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుందని, విలన్ గా మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ చేస్తున్నాడని వార్తలు వినిపించాయి.
అయితే నేడు టొరంటో నుండి హైదరాబాద్ కి వస్తున్నట్టు హీరోయిన్ ప్రియాంక చోప్రా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో ని స్టోరీ లో పెట్టుకోగా, దానిని అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేసి బాగా వైరల్ చేసారు. ఎందుకు హైదరాబాద్ కి వస్తుంది?, విషయం ఏమిటి? అనేది ఆమె నేరుగా చెప్పలేదు కానీ, ఈ సమయంలో హైదరాబాద్ కి వస్తుందంటే కచ్చితంగా రాజమౌళి, మహేష్ సినిమా కోసమే అని అభిమానులు నిర్ధారించుకున్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా, ఆ తర్వాత హాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడే స్థిరపడింది. అక్కడ విలన్ గా, హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో విభిన్నమైన కోణాల్లో తనని తాను ఆవిష్కరించుకొని హాలీవుడ్ సూపర్ స్టార్స్ లో ఒకరిగా చేరిపోయింది. ఇప్పుడు ఆమె హాలీవుడ్ లో ఒక్కో సినిమాకి 10 మిల్లియన్లకు పైగా డాలర్స్ ని రెమ్యూనరేషన్ గా అందుకుంటుంది.
10 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 80 కోట్ల రూపాయిలు. ఆ స్థాయి రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్ ని రాజమౌళి తన సినిమా కోసం తీసుకుంటున్నాడంటే, ఏ రేంజ్ లో ఆమెకి డబ్బులు ఆఫర్ చేసి ఉంటాడో ఊహించుకోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. ఇది ఇలా ఉండగా త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆఫ్రికా లోని కొన్ని తెగలలో 20 రోజుల పాటు గడిపి, వాళ్ళ అలవాట్లు, జీవిన విధానం మీద పట్టు సాధించబోతున్నాడట. అంతే కాకుండా చైనా లో ప్రత్యేక నిపుణుల మధ్య ఆయన మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఆయన తన నుండి ది బెస్ట్ ఔట్పుట్ వచ్చేలా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడట. సుమారు వెయ్యి కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 వ సంవత్సరం లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది.
మహేష్ బాబు – రాజమౌళి SSMB29 సినిమాలో నటించబోతున్న ప్రియాంక చోప్రా!!
టొరంటో నుండి హైదరాబాద్కు వస్తూ తన ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన ప్రియాంక చోప్రా #SSMB29 pic.twitter.com/gdcKQEUJ2A
— Telugu Scribe (@TeluguScribe) January 17, 2025