Saif Ali Khan Incident: సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) పై జరిగిన దాడి విషయంలోనూ పై ఉదంతమే కనిపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరగడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారంతా సంతాపం తెలుపుతున్నారు. కానీ ఈ స్టారాధిష్టారులు తెలుగు రాష్ట్రాలలో జరిగిన దారుణాలపై, దుర్ఘటనలపై ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. సినీ ప్రముఖులకు సొసైటీ కావాలి. సొసైటీ నుంచి వచ్చే డబ్బులు కావాలి. అంతే తప్ప సొసైటీ కి ఒక రూపాయి కూడా వారు తిరిగి ఇవ్వరు. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నివాసముండే ఇంట్లో భారీ బందోబస్తు ఉంటుంది.. ఆ నివాసం కూడా ఒక కోట లాగా ఉంటుంది. అలాంటి ప్రదేశంలోకి దొంగ ఎలా వెళ్లాడు? అంతటి కోటలోకి దొంగ వెళ్లడం అత్యంత సులభమా? లేక అతడికి పనిమనుషులు ఎవరైనా తెర వెనుక సహాయం చేశారా? లేక ఆ దొంగ ముందుగానే వచ్చి ఇంట్లో ఉన్నాడా? మధ్యలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయ ఎందుకు ప్రవేశించాడు? అతడు అందులో ఏం గమనించాడు.. ఈ ప్రశ్నలు కాస్త పక్కన పెడితే.. సో కాల్డ్ బాలీవుడ్ ఏం చెబుతోంది అంటే.. ఆ దొంగ రీల్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను కోటి రూపాయలు ఇవ్వాలని అడిగాడట. దానికి సైఫ్ నో చెప్పాడట. దీంతో దొంగ పట్టలేని ఆవేశంతో కత్తితో పొడిచి వెళ్లిపోయాడాట. చదువుతుంటే సినిమా లాగానే కనిపిస్తోంది కదా.. ఎటువంటి లాజిక్ లు లేకుండా అల్లబడిన కథలాగే ఉంది కదా.. అసలు ఆ దొంగ ఎవడు? ఎందుకు వచ్చాడు? పట్టుబడితే ఏం చెబుతాడు? ఒకవేళ వాడు పట్టుబడితే దయ అనే అధికారి కనీసం వాడికి మాట్లాడే అవకాశం అయినా ఇస్తాడా లేదా? అనేది తెలియదు.. ఇప్పటికే సైఫ్ అలీఖాన్ ఘటనను మహారాష్ట్రలో విపక్షాలు తమ రాజకీయాలకు అనుకూలంగా మలుచుకున్నాయి. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సెలబ్రిటీలకు రక్షణ ఇవ్వలేకపోతుందని ఆరోపించడం ప్రారంభించాయి. ఇక్కడే వేలకోట్ల ధనం ఉన్న సెలబ్రిటీలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యతా? అని వేలకోట్లు ఉన్నోళ్లు తమకు తాము రక్షణ కల్పించుకోలేరా? ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోలేరా? ఒక్కో రిచ్ సార్ ఇంటి వద్ద ప్రభుత్వం డబ్బులు ఇచ్చి పోలీసు బలగాలను మొహరింపజేయాలా? ఏంటో రాను రాను ఇండియా కూటమిలో పార్టీల మాదిరిగానే.. నాయకుల మాటలు కూడా ఉంటున్నాయి.
ఎక్కడో మార్గం దొరికే ఉంటుంది
ఎంతటి గొప్పకోట అయినా.. భారీగా బందోబస్తు ఉన్న భవనం అయినా.. అందులోకి వెళ్ళాలి అనుకున్న వ్యక్తికి కచ్చితంగా ఏదో ఒక మార్గం దొరికే ఉంటుంది. అవకాశం లభిస్తే ఇంటి యజమాని పై దాడి చేసే సమయం కూడా దక్కుతుంది. ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ఘటన విషయంలోనూ.. ఇలాంటివే చోటుచేసుకుని ఉంటాయి కావచ్చు. ఇదంతా తెలుసు కాబట్టే.. ఈ పరిణామాలను ముందుగానే చూసి ఉన్నాడు కాబట్టే సల్మాన్ ఖాన్ తన ఇంటిని పటిష్టం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పటికే వేలాది సీసీ కెమెరాలు పెట్టించుకున్నాడు. వందల మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డులతో నిత్యం పహారా కాయించుకుంటున్నాడు. వాస్తవానికి సైఫ్ ఉంటున్న ఇల్లు 12 అంతస్తుల్లో ఉంటుంది. అతడి ఆస్తుల విలువ 1200 కోట్లు. వ్యక్తిగత సిబ్బంది పదిమంది.. 10 ఎకరాలలో ఆ ఇల్లు ఉంది. పదుల సంఖ్యలో కార్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తి కత్తిపోట్లకు గురి కావడం.. ఆ సమయానికి ఎవరూ రాకపోవడం.. చివరికి సైఫ్ కుమారుడు ఆటోలో ఆసుపత్రికి తరలించడం వంటి ఘటనలు సినిమాను తలపించాయి. సమయానికి డ్రైవర్లు లేకపోవడం.. అంబులెన్స్ రావడానికి సమయం పట్టడం.. షెడ్ ఓపెన్ చేసి కారు బయటకు తీసుకొచ్చేసరికి సమయం పట్టడం.. ఇవన్నీ గుర్తించే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఆటోలో తన తండ్రిని ఆసుపత్రికి తరలించాడు. అతడు ఆలోచించిన విధానమే..ఆ సమయస్ఫూర్తే ఈరోజు సైఫ్ అలీ ఖాన్ ను బతికేలా చేసింది.. ఆ దుండగుడు పొడిచిన తీరుకు సైఫ్ అలీ ఖాన్ వెన్నులో కత్తి మొన విరిగింది. దానిని వైద్యులు వెంటనే తొలగించారు. ఒకవేళ ఇబ్రహీం అక్కడ లేకపోయి ఉంటే.. వెంటనే స్పందించకపోయి ఉంటే.. సైఫ్ అలీ ఖాన్ ఇప్పటికే జ్ఞాపకం అయిపోయేవాడు.