Mahakumbha
Mahakumbha : ప్రయాగరాజ్ లో మహాకుంభం మొదలైన విషయం తెలిసిందే. ఇక్కడికి కోట్ల మంది భక్తులు వస్తున్నారు. ఆ మహా శివుని దర్శనం, త్రివేణి సంగమంలో స్నానం చేయాలని ఎందరో అక్కడికి చేరుకున్నారు. ఈ మహాకుంభానికి 40 నుంచి 50 కోట్ల మంది రానున్నారు. అయితే ఈ మహా కుంభమేళ ప్రారంభం అయిన దగ్గర నుంచి సాధ్వి హర్ష రిచార్య పేరు వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్ష రిచార్య సోషల్ మీడియాలో అత్యంత అందమైన సాధ్వి అని ఎందరో కొనియాడుతున్నారు. ఇంత అందమైన మహిళ సాధ్వి ఎలా అయింది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ 30 ఏళ్ల హర్ష వీడియో వైరల్ అయిన తర్వాత, ప్రతి ఒక్కరూ తన గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, ప్రతి చిన్న, పెద్ద మీడియా ఛానెల్ ఆమె ఇంటర్వ్యూలను తీసుకుంటుంది. అందులో ఆమె సాధ్విగా ఎందుకు మారాలని నిర్ణయించుకుంది అని అడిగారు. తాను మత మార్గాన్ని అనుసరిస్తున్నాను అంటూ తెలిపింది.
ఇక హర్ష మహాకుంభంలోకి ఎంట్రీ ఇస్తున్నప్పడు ఆమె కూడా నిరంజనీ అఖారా రథంపై కూర్చొని కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై పెద్ద దుమారం రేగింది. హర్షను రథంపై కూర్చోబెట్టి కాషాయ వస్త్రాలు ధరించి రావడం పట్ల కొందరు సాధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ఎంతగా పెరిగిపోయిందంటే హర్ష రిచార్య ఏడుస్తూనే మహాకుంభ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
హర్ష తన సోషల్ మీడియా ఖాతా X (గతంలో ట్విట్టర్)లో వీడియోను పంచుకున్నారు. అందులో ఆమె వెక్కివెక్కి ఏడుస్తూనే కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇక మతంలో చేరేందుకు, మతం తెలుసుకోవాలని, సనాతన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి వచ్చిన ఓ అమ్మాయిని మహాకుంభంలో ఉండకుండా చేశారు. కచ్చితంగా మీరు సిగ్గు పడాలి. మన జీవితంలో ఒక్కసారైనా వచ్చే ఈ మహా కుంభం నుంచి నన్ను పంపిస్తున్నారు. మీరు ఒక వ్యక్తి నుంచి ఈ కుంభాన్ని లాక్కున్నారు. కచ్చితంగా ఆనంద్ స్వరూప్ జీ చేసిన పాపం ఊరికే పోదు. అనుభవిస్తారు అంటూ ఏడ్చింది ఈ సాధ్వి. తనను సంస్కృతితో కనెక్ట్ అయ్యే అవకాశం లేకుండా చేశారని? తాను చేసిన తప్పు ఏంటని అడిగింది. అందుకే వెళ్లిపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంతకీ ఈమె ఎవరు?
30 ఏళ్ల హర్ష రిచార్య ఉత్తరాఖండ్‌కు చెందినవారు. తన అసలు ఇల్లు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలిస్తే తాను యాంకర్, మేకప్ ఆర్టిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ట్రావెల్ బ్లాగర్‌గా అని తెలుస్తుంది. కానీ ఈ పనులకు పులిస్టాప్ పెట్టి తాను సాధ్విగా మారింది.