Eesha Rebba Marriage: ఈషా రెబ్బా అచ్చ తెలుగు హీరోయిన్. కెరీర్ కొత్తల్లో ఎక్స్ పోజింగ్ విషయంలో కాస్త మొహమాట పడింది, దాంతో అనుకున్నంత స్పీడ్ గా ఈషా కెరీర్ సాగలేదు. నత్తలా నెమ్మదిగా సాగుతూ చిన్నాచితకా చిత్రాల హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతానికి కూడా అమ్మడు చేతిలో క్రేజీ ఆఫర్లేవీ లేవు. అయితే ఈషా పెళ్లి విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈషా రెబ్బా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం తమిళ్లో పలు చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ అక్కడి ఓ స్టార్ డైరెక్టర్‌తో ప్రేమలో పడిందని.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇటీవల ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించారని తమిళ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఈషా స్పందించాల్సి ఉంది. మరి నిజంగానే ఈషా ప్రేమలో పడిందా ? చూడాలి.
Also Read: Puri Jagannath: లైగర్ ఎఫెక్ట్ : అద్దె కట్టలేక ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేస్తున్న పూరి జగన్నాథ్..
ఏది ఏమైనా తెలుగు తెరపై పాల నురుగు అందాలను అద్దే ప్రయత్నంలో ఉంది ‘ఈషా రెబ్బా’. ఈ మధ్య ఆమె తరుచూ తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అయితే, తాను అచ్చ తెలుగు అమ్మాయి కావడంతోనే స్టార్ హీరోయిన్ కాలేకపోయాను అని అంటుంది. అయినా ఈషా ఏ మాత్రం నిరాశ చెందకుండా తాజాగా ఛాన్స్ ల కోసం ఇలా ఎక్స్ పోజింగ్ తో రెచ్చిపోతుంది.
కుర్రాళ్ల హృదయాల పై తనదైన గ్లామర్ ముద్రను ముద్రించడానికి రోజురోజుకు అందాల పరిధి దాటుతుంది. మొత్తమ్మీద అందాల ఆరబోత కోసం ఈషా రెబ్బా చాలా కష్టపడుతుంది. ఆ కష్టం ఆమె ఈ మధ్య పోస్ట్ చేస్తున్న ఫోటోల్లో క్లారిటీగా కనిపిస్తోంది. అయితే, ఈషా రెబ్బా తన వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తోన్నా… ఆమెను ఆదరించడం లేదు టాలీవుడ్ దర్శక నిర్మాతలు.
అందుకే ఈషా గ్లామరస్ గా కనిపించేందుకు బోల్డ్ ఫోటో షూట్ లు చేస్తూ మొత్తానికి రచ్చ చేస్తోంది. అలాగే పరాయి భాషల భామలకు పోటీ ఇచ్చేందుకు బికినీ కూడా వేయడానికి సై అంటుంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి చాలా జిమ్మిక్కులు చేస్తోంది.
Also Read:Ram Charan- Shankar Movie: షాకింగ్ : చరణ్ – శంకర్ సినిమా విజువల్స్ లీక్.. ఇలా అయితే ఎలా ?