Esha Guptha: ఈషా గుప్తా… హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లోనూ అభిమానులను అలరిస్తుంది బాలీవుడ్ బ్యూటీ. వరుస ఆఫ్ర్లతో దూసుకుపోతూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల సన్‌బాత్ అంటూ టాప్లేస్ ఫొటోలు షేర్ చేసి నెటిజన్ల మతి పోగోట్టింది ఈషా. దీంతో కొందరూ ఆమె ఫొటోలకు పాజిటివ్‌గా రెస్పాండ్ కాగా… మరికొందరు మాత్రం ట్రోల్ చేస్తూ తన పోస్ట్‌పై ఆసభ్యకరంగా కామెంట్స్ చేశారు. తాజాగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందిస్తూ నెటిజన్లపై ఈషా గుప్తా మండిపడింది.

ఇప్పటి వరకు సోషల్ మీడియాలో నాపై వచ్చే ట్రోల్స్ చూసి బాధపడేదాన్నని … కానీ ప్రస్తుతం అలాంటి ట్రోల్స్‌ను పట్టించుకోవడం మానేశానని చెప్పింది. వాటికి అసలు స్పందించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. కానీ నేను ఏం చేసినా కొందరు అదే పనిగా నన్ను వేలెత్తి చూపుతున్నారు. ఇటీవల నేను పంచుకున్న ఫొటోలకు అసభ్యకర రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను స్పందించక తప్పడం లేదంటూ చెప్పింది. చాలా మంది మేల్ యాక్టర్స్ షర్ట్ లేకుండా ఫొటోలు షేర్ చేస్తే ‘మీ బాడీ సూపర్బ్‌గా ఉంది’ అంటూ సానుకూలంగా కామెంట్ చేస్తారు. మరి వారిని ఎందుకు పూర్తి దుస్తులు ధరించమని చెప్పరు అని మండిపడింది.
ఎందుకంటే నెటిజన్లలో కొందరు లింగ వివక్ష చూపుతున్నారు. చీర ధరించి ఫొటో షేర్ చేస్తే ఈరోజు మీరు పూర్తి దుస్తులు ధరించారు అని వెటకారం చేస్తారు. మేకప్ ధరించిన ఫొటోలను పంచుకుంటే ‘ప్లాస్టిక్ బ్యూటీ’ అని కామెంట్లు పెడతారు. మేకప్ లేని ఫొటోలను షేర్ చేస్తే ‘నువ్వు అందంగా లేవు ముఖానికి మేకప్ వేసుకో’ అని సలహాలు ఇస్తారు. ఇలా ఇండియాలోనే కాదు ప్రపంచంలోని నలుమూలలా ఆడవాళ్లపై వివక్ష కొనసాగుతోంది. మహిళలకు సంబంధించి మన ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇక నా విషయానికొస్తే నేను మానసికంగా ఎంతో బలవంతురాలిని ఎవరైనా ఒకసారి నా చెంపమీద కొడితే నేను రెండుసార్లు వారి చెంపలు వాయిస్తాను అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.