Rajamouli On NTR: స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన రాజమౌళి ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఆయన చేసిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ గా తన సత్తా చాటుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి పేరు మీద ఒక బ్యాడ్ రికార్డ్ అనేది ఇంకా కూడా అలానే ఉంది.
అయితే రాజమౌళి సినిమాలో చేస్తే ఆ హీరోకి ఆ సినిమా తో మంచి సక్సెస్ అయితే దక్కుతుంది కానీ ఆ తర్వాత హీరో చేసిన సినిమా ఏది కూడా సక్సెస్ అవ్వదు అనే ఒక బ్యాడ్ నేమ్ అయితే ఉంది. ఇక ఇప్పటివరకు ప్రతి ఒక్కరు ఆ నేమ్ ని చెరిపేయాలేకపోతూ వస్తున్నారు ఇక రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమా చేసిన తర్వాత రామ్ చరణ్ చేసిన ఆచార్య సినిమా ఫ్లాప్ అవడంతో రామ్ చరణ్ కూడా రాజమౌళి మీద ఉన్న ఈ బ్యాడ్ నేమ్ ని చెరిపేయలేకపోయాడు.
ఇక దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి పేరు మీద ఉన్న బ్యాడ్ నేమ్ ని తొలగిస్తాడా అనేది చర్చనియాంశం గా మారింది. ఎందుకంటే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత చేస్తున్న దేవర సినిమా సక్సెస్ అయితే ఎన్టీఆర్ వరుసగా ఏడు సక్సెస్ లను కొట్టిన స్టార్ హీరోగా గుర్తింపు పొందుతాడు. అలాగే ఇటు రాజమౌళి పేరు మీద ఉన్న బ్యాడ్ నేమ్ ని కూడా తొలగిస్తాడు కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమా సక్సెస్ మీదనే ఈ చెత్త రికార్డ్ అనేది ఆధారపడి ఉంది.
ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే రాజమౌళి పేరు మీద ఉన్న బ్యాడ్ నేమ్ అనేది తొలగిపోతుంది ఒకవేళ ఈ సినిమా కనక ఫ్లాప్ అయితే మాత్రం మరోసారి రాజమౌళి పేరు మీద ఉన్న ఆ బ్యాడ్ నేమ్ అనేది అలాగే కంటిన్యూ అవుతుంది. చూడాలి మరి రాజమౌళి పేరు మీద ఉన్న ఆ బ్యాడ్ రికార్డ్ ని కూడా ఎన్టీఆర్ చెరిపేస్తాడో లేదో అనేది…