Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్ ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయన హీరోగా చాలా ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించాడు.ఇక ఈయనకి చాలామంది దర్శకులు విజయాలను అందించారు. అయితే ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ ఒకసారి సినిమా ఛాన్స్ ఇచ్చిన ప్రతి డైరెక్టర్ కి మరొకసారి సినిమా అవకాశం ఇస్తూనే వచ్చాడు. ఎందుకంటే ఆయన ఒకసారి కన ఒక డైరెక్టర్ ని నమ్మితే ఆ డైరెక్టర్ మీద పూర్తి కాన్ఫిడెంట్ ని ఉంచి వాళ్లకు సినిమాని చేసే అవకాశాన్ని కల్పిస్తాడ
అందుకే పవన్ కళ్యాణ్ అంటే అందరికీ మంచి అభిమానం ఉంటుంది. ఇక సెకండ్ గ్రేడ్ డైరెక్టర్లు అయిన కూడా వాళ్ళని ఏమాత్రం డిస్కరేజ్ చేయకుండా వాళ్లకి టాలెంట్ ఉంటే ఈజీగా పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం అయితే వస్తుంది. వాళ్ళ దగ్గర మంచి స్క్రిప్ట్ ఉండి పవన్ కళ్యాణ్ ని మెప్పించగలిగితే అతడికి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది కూడా చూడకుండా సినిమాలను ఈజీగా ఇచ్చేయడంలో పవన్ కళ్యాణ్ ముందు వరుస లో ఉంటాడు. అయితే పవన్ కళ్యాణ్ ముందు హిట్లు ఇచ్చి ఆ తర్వాత ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లు ఎవరేవరు ఉన్నారో ఒకసారి మనం తెలుసుకుందాం…
మొదట గా తొలిప్రేమ సినిమాని కనక చూసుకుంటే ఈ సినిమాతో కరుణాకర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాలు సినిమా మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకొని హీరో డైరెక్టర్లు ఇద్దరిని తీవ్రంగా నిరాశపరిచింది…
బద్రి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పూరి జగన్నాథ్ ని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక మళ్ళీ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని పవన్ కళ్యాణ్ ని పెట్టి ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడం లో ఏమాత్రం సక్సెస్ కాలేకపోయింది…
భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో మొదట సుస్వాగతం అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఆతర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్నవరం సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఖుషి సినిమాతో ఎస్ జే సూర్య డైరెక్టర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. కానీ ఆ తర్వాత వీళ్ళ కాంబో లో వచ్చిన పులి మూవీ ప్లాప్ అయింది…
ఇలా పవన్ కళ్యాణ్ కి మొదటి సినిమాతో మంచి హిట్ ఇచ్చి ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ప్లాపులు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఇంకా చాలామంది ఉన్నారు…