ప్రియా చెప్పిన జోస్యం కరెక్టే: బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వగానే ముందుగా నిర్వహించే ఇంటర్వ్యూ బిగ్ బాస్ బజ్. అలా ఎలిమినేట్ అయిన అవ్వగానే ఇంటికి వెళ్లకుండా ఒక నలభై నిమిషాల ఇంటర్వ్యూ ఇస్తారు. అలా గత మూడు సీజన్ల నుండి నిర్వహిస్తున్నారు బిగ్ బాస్ బజ్ కార్యక్రమం. మొదటి రెండు సీజన్ కి మాత్రం బిగ్ బాస్ బజ్ కార్యక్రమం నిర్వహించలేదు బిగ్ బాస్ నిర్వాహకులు. మూడో సీజన్ నుండి ఇప్పుడు జరిగే ఇదో సీజన్ వరకు బిగ్ బాస్ బజ్ కార్యక్రమం రన్ అవుతూ వస్తుంది.

ఇలా మూడో సీజన్ నుండి ఇప్పుడు ప్రసారమవుతున్న బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి తనీష్ (రెండో సీజన్ రన్నర్ అప్), సింగర్ రాహుల్ సింప్లిగంజ్ (మూడో సీజన్ విన్నర్), అరియనా గ్లోరీ (బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్) వ్యాఖ్యాతలుగా తమదైన స్టయిల్ లో అద్భుతం గా రాణిస్తున్నారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్: అప్పుడే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో ఖచ్చితంగా ఒకపాటి బాధ, కోపం ఉంటుంది. అలా ఎమోషన్స్ ని కాష్ చేసుకుని కంటెస్టెంట్స్ లో ఉన్న బాధ, కోపం చల్లారకముందే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. అటువంటు సమయం లో ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ మీద తమ అభిప్రాయాలని బయటపడతారు.
ఈ క్రమం లో బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన ఆర్టిస్ట్ ప్రియా లోబో మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. సీజన్ 5 కి వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న అరియనా గ్లోరీ… లోబో మీద మీ అభిప్రాయం చెప్పండి అనగా.. ఆ మనిషి నాకు అర్ధం కాడు, ఏం చేస్తాడో ఏం చెప్తాడో నాకు అయితే అర్ధం కాదు అంటూ, వచ్చేవారం ఖచ్చితంగా లోబో ఎలిమినేట్ అయ్యే ధాఖలాలు కనిపిస్తున్నాయి అని బల్ల గుద్దినట్టు చెప్పింది, అదే జరిగింది కూడా. అలా బిగ్ బాస్ లో ఎనిమిదో వారానికి లోబో ఎలిమినేట్ అయ్యాడు.