Emraan Hashmi Son: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi). ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఈయనంటే పడి చచ్చిపోయేవారు. ఆరోజుల్లో ఆయన తీసే సినిమాలు, సాంగ్స్ అలాంటివి మరీ. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీ చిత్రాల్లోని పాటలు అప్పట్లో ఒక సెన్సేషన్. ‘జలాక్ దిగలాజ’ అనే పాట ఆరోజుల్లో దేశవ్యాప్తంగా సృష్టించిన సెన్సేషన్ ని అంత తేలికగా ఎవరైనా మర్చిపోగలరా?. ఇప్పటికీ ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఇమ్రాన్ హష్మీ కి ఈమధ్య కాలం లో హీరో గా సరైన హిట్స్ లేవు. దీంతో ఆయన విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాడు. అందులో భాగంగా ఆయన నటించిన ‘టైగర్ 3’ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత రీసెంట్ గానే ఆయన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రంలో నటించాడు.
ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మనమంతా చూసాము. ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లతో రన్ అవుతుంది ఈ చిత్రం. ఈ సినిమా ద్వారా ఇమ్రాన్ హష్మీ నేటి తరం ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అనేక సన్నివేశాల్లో ఆయన లుక్స్, స్వాగ్, స్టైల్ ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఈ సినిమా ఆయన కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మంచి క్యారెక్టర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇమ్రాన్ హష్మీ కి పెళ్లి అయ్యిందని, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?. ఆయన సతీమణి పేరు పర్వీన్ షహాని. ఈమెకు సినీ ఇండస్ట్రీ తో ఎలాంటి సంబంధం లేదు, ఒక్క సినిమాలో కూడా నటించలేదు కానీ, చూసేందుకు స్టార్ హీరోయిన్స్ అందానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.
ఇక వీళ్లిద్దరికీ అయాన్ హష్మీ అనే కుమారుడు ఉన్నాడు. 2010 వ సంవత్సరం లో అయాన్ పుట్టాడు. ఇప్పుడు ఆయనకు 15 ఏళ్ళు. తన తండ్రి లాగానే ఇతను కూడా చూసేందుకు ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం విద్యాబ్యాసం లో ఉన్న ఆయన, త్వరలోనే ఇండస్ట్రీ లోకి హీరో గా వెండితెర అరంగేట్రం చేయబోతున్నాడు అని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సినిమాల్లోకి వస్తే ఇతను కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఫోటోలను కొన్ని మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.