Emraan Hashmi Lips: బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న నటుడు ‘ఇమ్రాన్ హష్మీ’… ప్రస్తుతం ఆయన హీరోగా సినిమాలు చేయడం తగ్గించాడు. మంచి పాత్ర దొరికితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘ఓజీ’ సినిమాలో ఇమ్రాన్ హష్మీ ‘ఓమి’ పాత్రని పోషించాడు… స్టైలిష్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం ఇప్పుడు ఓమి పాత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఓజీ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే ఇమ్రాన్ విలన్ గా మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యాడనే వార్తలైతే వస్తున్నాయి… ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు లిప్ లాక్ లకు చాలా ఫేమస్…యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. సీరియల్ కిస్సర్ గా తనకు మంచి గుర్తింపైతే ఉంది. ఇక ప్రస్తుతం అతను ఒక బ్రాండ్ కు సంబంధించిన మార్చరైజర్ కోసం ఒక ఆడ్ ఫిలిమ్ చేశాడు. అందులో భీమా ఏజెంట్ ఫన్నీ గా ఐశ్వర్యారాయ్ కండ్లకు, అమితాబచ్చన్ గొంతుకి భీమా చేయించుకున్నారు.
మీరు మీ పెదాలకి చేయించుకోండి సార్ బాగుంటుంది అంటూ ఇమ్రాన్ హష్మీతో కొన్ని మాటలైతే చెప్పాడు. దానికి ఇమ్రాన్ హష్మీ కౌంటర్ గా తన అసిస్టెంట్ తో తన గురించి చెప్పమని కోరగా తను మాట్లాడుతూ మా సార్ పెదవులు దుమ్ము నుంచి, ధూళి నుంచి, తుఫాన్ నుంచి కూడా తప్పించుకోగలవు దానికి ఏమీ ఇబ్బంది లేదు అంటూ మొత్తానికైతే ఆ బ్రాండ్ ప్రమోషన్ ను చేశారు.
అయినప్పటికి ఇమ్రాన్ హష్మీ పెదవులకు భీమా చేయించుకో అని ఏజెంట్ చెప్పిన మాటలకి చాలామంది నెటిజన్లు సైతం రియాక్ట్ అవుతున్నారు. నిజంగానే ఇమ్రాన్ హష్మీ తన పెదవులకు భీమా చేయించుకుంటే మంచిదని ఇప్పటివరకు ఎంతమందిని కిస్ చేశాడో తనకే లెక్క తెలియదని, అలాంటి పెదవులకు ఏం అవ్వకూడదని ఇమ్రాన్ హష్మీ ని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు.
ఇక ఇదంతా పక్కన పెడితే ఇమ్రాన్ హష్మీ ఒజీ మూవీ లో తన విలనిజాన్ని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఆయన ప్లేస్ లో తెలుగు యాక్టర్ ను పెడితే అంత ఇంపాక్ట్ వచ్చిండేది కాదు. ఇక దానికి తోడుగా బాలీవుడ్ లో కూడా ఈ సినిమాని చాలామంది ఆదరించడానికి ఇమ్రాన్ హష్మీ కూడా ఒక కారణమనే చెప్పాలి…