https://oktelugu.com/

Emmanuel- Varsha: వర్ష నిజస్వరూపం బయటపెట్టిన ఇమాన్యుయేల్.. నిజంగా వర్ష అంత పని చేసిందా ?

Emmanuel- Varsha: జబర్దస్త్ వేదికపై ప్రేమ కథలు కొత్తేమి కాదు. యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. చాలా ఏళ్లుగా వీళ్ళ ప్రేమాయణం సాగుతుంది. బుల్లితెరపై ఓపెన్ గా ప్రేమించుకునే ఈ ప్రేమ జంట, అసలు కథ ఏమిటనేది ఎవరికీ తెలియదు. క్రేజ్ కోసం, కెరీర్ కోసం వీరు ప్రేమ అని నటిస్తున్నారా, లేక మనస్సులో కూడా ఒకరంటే ఒకరికి ఇష్టమా అనే సందిగ్ధత కొనసాగుతుంది. కాగా వీరి బాటలోనే జబర్ధస్త్ వేదికగా […]

Written By:
  • Shiva
  • , Updated On : August 15, 2022 / 05:30 PM IST
    Follow us on

    Emmanuel- Varsha: జబర్దస్త్ వేదికపై ప్రేమ కథలు కొత్తేమి కాదు. యాంకర్ రష్మీ, కమెడియన్ సుధీర్ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. చాలా ఏళ్లుగా వీళ్ళ ప్రేమాయణం సాగుతుంది. బుల్లితెరపై ఓపెన్ గా ప్రేమించుకునే ఈ ప్రేమ జంట, అసలు కథ ఏమిటనేది ఎవరికీ తెలియదు. క్రేజ్ కోసం, కెరీర్ కోసం వీరు ప్రేమ అని నటిస్తున్నారా, లేక మనస్సులో కూడా ఒకరంటే ఒకరికి ఇష్టమా అనే సందిగ్ధత కొనసాగుతుంది. కాగా వీరి బాటలోనే జబర్ధస్త్ వేదికగా మరో ప్రేమ కథ చిగురించింది.

    Emmanuel- Varsha

    అదే వర్ష ఇమాన్యుయేల్ లవ్. టీవీ నటి వర్ష జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాక, వర్ష గ్లామర్ చూసిన ప్రేక్షకులు ఆమెకు బాగా కనెక్ట్ అయ్యారు. లంగా ఓణీ, శారీలలో వర్ష గ్లామర్ షో, ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే, నల్లగా ఉండే ఇమ్మాన్యుయేల్ వెంటపడే అమ్మాయిగా వర్షను చూపిస్తూ వీరి లవ్ ట్రాక్ ను డిజైన్ చేశారు డైరెక్టర్లు. వర్ష, ఇమ్మాన్యుయేల్ స్కిట్స్ జబర్దస్త్ లో బాగానే సక్సెస్ అయ్యాయి కూడా.

    దాంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. వర్ష నల్లగా ఉన్నప్పటికీ జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ని ఇష్టపడుతుందని, ఇమ్మాన్యుయేల్ మాయలో పడిపోయిన వర్ష అతని ప్రేమ కోసం పరితపిస్తోంది అని వార్తలు పుట్టించారు. నిజం ఏదైనా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరో ప్రేమ జంట తయారైంది.

    Emmanuel- Varsha

    వర్ష ఇమాన్యుయేల్ పెళ్లి మీదే ఈవెంట్ చేసే వరకు వచ్చింది వీరి లవ్ ట్రాక్. అయితే, వీరి పెళ్లి నాటకం ఆడుతూ వేసిన స్కిట్ తరువాత జనాలు చీదరించుకోవడం మొదలుపెట్టారు. దీంతో మధ్యలో ఈ ట్రాక్ గొడవను పక్కన పెట్టేశారు. అయినా వీరు లవర్స్‌గానే స్క్రీన్ మీద కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఈ ఇద్దరిది నిజమైన ప్రేమే అని భ్రమపడేలా చేస్తుంటారు.

    ఇక వర్ష అయితే లవ్ కొటేషన్స్, ప్రేమ డైలాగ్స్ బాగానే చెబుతుంది స్టేజ్ మీద. కానీ గెటప్ శ్రీను వేసిన స్కిట్ లో అసలు విషయం తెలిసింది. మేం ఇద్దరం లవర్స్ కాదు.. ఎవరు చెప్పారండి.. కెమెరా ముందు డైలాగ్స్ చెబుతుంది.. బయటకు వెళ్తే నా నంబర్ బ్లాక్ చేస్తుంది. అంటూ ఇమాన్యుయేల్ తెగ ఫీల్ అయిపోయాడు. పైగా తన బాధ గురించి కూడా చెప్పుకుని తెగ ఇదైపోయాడు. ‘నేను ఎక్కడికైనా వెళ్తే.. అన్నా వదిన ఎక్కడా ? అని అడుగుతుంటారు.. అని తన బాధను వ్యక్తపరిచాడు ఇమాన్యుయేల్.

    Tags