Vishwak Sen- Niharika: మెగా కుటుంబానికి చెందిన నిహారిక సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తన నటనతో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయింది. ఇటీవల వెబ్ సిరీస్ లు నిర్వహిస్తూ తన సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి వంటి వెబ్ సిరీస్ లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ మధ్య ఓ చిన్న ఫ్యామిలీ అనే వెబ్ సిరీస్ కూడా నిర్మించగా అది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హలో వరల్డ్ అంటూ ఆర్యన్ రాజేష్, సదా హీరోహీరోయిన్లుగా మరో వెబ్ సిరీస్ ప్రారంభించింది.

ఈ సిరీస్ సక్సెస్ కోసం ప్రస్తుత హీరో విశ్వక్ సేన్ ను రంగంలోకి దింపింది. ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్ ను ఆహ్వానించింది. ఫోన్ చేయడంతోనే అతడు హాజరయి నిహారిక మీద పంచుల వర్షం కురిపించాడు. దీంతో నిహారిక ఇబ్బందులు పడినా అతడు మాత్రం తన మాటల జడివానను ఆపలేదు. ఒక దశలో నిహారిక పడిన ఇబ్బందిని సైగల ద్వారా సూచించినా ఆగలేదు. మొత్తం బండారం బయటపెట్టాడు. తాను నిహారిక క్లాస్ మేట్స్ అని చెప్పేశాడు. మాస్ జర్నలిజం చదువుతుండగా అందరు నిహారికను చూసి భయపడేవారని గుట్టంతా విప్పాడు.
Also Read: Actress Rambha: భర్త తో విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కిన హీరోయిన్ రంభ
ఎవరికి భయపడకున్నా నిహారికకు మాత్రం భయపడేవాడినని చెప్పాడు. ఎప్పుడు కూడా ఏయ్ అని సంబోధించేదని చెప్పాడు. ఇప్పుడు కూడా ఏయ్ అని ఫోన్ చేసి మాట్లాడిందని గుర్తు చేశాడు. నిహారిక నైజాన్ని విశ్వక్ సేన్ స్టేజీ మీదే బయటపెట్టడంతో ఆమె ఇబ్బంది పడింది. ఆపు బాబూ అని సైగలు చేసినా అతడు మాత్రం తగ్గలేదు. నీకు దండం పెడతా బాబూ ఆపేయ్ అని నిహారిక మొత్తుకుంటున్నా విశ్వక్ సేన్ మాత్రం తన ఫ్లో ఆపలేదు. నిహారిక లేడీ ప్రొడ్యూసర్ గా భావించానని చెప్పడం విశేషం. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హై హీల్స్ వేసుకుని రావడంతో విశ్వక్ సేన్ ఆమెపై కూడా పంచులు వేశాడు. దీంతో స్టేజీ మీద నవ్వులు పూయించారు.

ఇక అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా హిట్ కావడంతో యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో చిన్న ఫ్యామిలీ వెబ్ సిరీస్ సక్సెస్ కాకపోవడంతో నిహారిక డైలమాలో పడింది. ఇక మళ్లీ మరో చిన్న ఫ్యామిలీ 2 ఎప్పుడు మొదలు పెడుతుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. దీంతో నిహారిక వెబ్ సిరీస్ లు మళ్లీ విజయాలు సాధిస్తాయా? ఆమెకు మంచి సక్సెస్ వస్తుందా? లేదా? అని ప్రేక్షకులు ఎంతో కాలంగా చూస్తున్నారు. ఈ క్రమంలో నిహారిక వెబ్ సిరీస్ లు మళ్లీ విజయాల బాట పడతాయో లేదో వేచి చూడాల్సిందే.
Also Read:Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల రూపాయిలు ఫైన్ వేసిన ప్రముఖ స్టార్ నిర్మాత