చిత్రం పేరు: ఎకో
టెలికాస్ట్ తేదీ: జనవరి 2 నుంచి
స్ట్రీమింగ్ వేదిక: నెట్ ఫ్లిక్స్
ఓకే తెలుగు రేటింగ్: 3/5
తారాగణం: సందీప్, సౌరబ్, వినీత్, బిను పప్పు, బియానా మోమిన్, అశోకన్, నారాయణ్.
దర్శకత్వం: జడుహరం అయ్యేతన్,
సంగీతం: ప్రో కె ఆర్
సినిమాటోగ్రఫీ: బహుల్ రమేష్
ఎడిటర్: సూరజ్
కోవిడ్ సమయంలో థియేటర్లు మూసి ఉన్నాయి. ఈ సమయంలో అన్ని ఓ టి టి వేదికలలో మలయాళ చిత్రాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్ సినిమాలు విడుదల కావడం.. అవి తెలుగు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించడం.. వంటి పరిణామాలతో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పైగా అక్కడ కథా నేపథ్యం ఉన్న సినిమాలు నిర్మిస్తారు. థ్రిల్లర్, సస్పెన్స్ వంటి వాటికి ప్రాధాన్యమిస్తారు. అందువల్లే తెలుగు ప్రేక్షకులు మలయాళ డబ్ సినిమాలను విపరీతంగా ఇష్టపడుతున్నారు.
మలయాళం లో ఇటీవల ఎకో (eko movie review) అనే పేరుతో ఓ సినిమా విడుదలైంది. అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం రోమాంచితం గా ఉంది. థ్రిల్లర్ జోనర్ లో ఉండడంతో మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతోంది. పనిలో పనిగా తెలుగులోకి కూడా డబ్ చేసింది. మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
సినిమా కథ ఏంటంటే
కేరళ రాష్ట్రంలో కాటు కున్ను అనే మారుమూల ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోనే ఈ సినిమా కథ మొదలవుతుంది. మలేషియా ప్రాంతానికి చెందిన సోయి అలియాస్ మ్లాతి (బియానా మోమిన్) ఎవరూ లేక ఒంటరిగా జీవిస్తున్న ఓ మహిళ కథను చెబుతుంది. ఆ మహిళను పర్యవేక్షించడానికి ఆమె కొడుకు పీయూష్(సందీప్ ప్రదీప్) మలేషియా జాతికి చెందిన కుక్కలను ఉంచుతాడు. ఆ కుక్కలు నిత్యం ఆమెను పర్యవేక్షిస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో ఆ ప్రాంతంలో కుక్కల సంరక్షకుడు కురిచయాన్(సౌరబ్ సచ్ దేవా) కేసులలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు కనిపించకుండా పోతాడు. అతడు స్నేహితుడు మోహన్ పోతన్(వినీత్) కూడా కురిచయాన్ జడ కోసం ప్రయత్నిస్తుంటాడు. అయితే శిక్షణ పొందిన కుక్కలతో అతడు దట్టమైన అడవిలో ఉన్నాడని చాలామంది నమ్ముతుంటారు. అయితే చాలామంది కురిచయాన్ ఎందుకోసం వెతుకుతున్నారు? పీయూష్ కుక్కలు నిజంగానే మనుషులను సంరక్షిస్తాయా? మలేషియా కి చెందిన ఒక మహిళ కేరళలో, అది కూడా ఒక మారుమూల అటవీ ప్రాంతంలో ఎందుకు నివసిస్తుంది? అనేవి ఈ చిత్రానికి సంబంధించిన చిక్కుముడులు.
ఇవే అనుకూలతలు
ఈ సినిమాకు ప్రధాన బలం మిస్టరీ నేపథ్యంలో కథను నడిపించడం. దట్టమైన అడవి.. అందులో ఒంటరి మహిళ…. సంరక్షించే కుక్కలు.. వెంటాడే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం. చూసేందుకు ఈ కథ చాలా సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ.. ఒక్కో సన్నివేశం ముందుకు వెళుతున్నా కొద్దీ సినిమాపై ప్రేక్షకుడి అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. నాన్ లీనియర్ కథనం, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను అంతకంతకు పెంచేస్తాయి.
నటన విషయంలో సందీప్ ప్రదీప్ నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. బియానా తన పరిధిలో నటించింది. ముఖ్యంగా ఆమె హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. దర్యాప్తు అధికారి పాత్రలో వినీత్ అద్భుతంగా నటించాడు.
ఇవే లోపాలు
ఈ సినిమాలో కథ నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సందర్భాలలో ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తుంది. కొన్ని సన్నివేశాలు సింక్ కాకుండా ఉంటాయి. అందువల్ల ప్రేక్షకుడు ఒక అంచనాకు రావడానికి సమయం పడుతుంది. కథ ముందుకు వెళుతున్న కొద్దీ కొన్ని సన్నివేశాలు ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షకుల మధ్యలో ప్రశ్నలను మెదిలే విధంగా చేస్తాయి. కురిచయాన్ పాత్ర పై ప్రేక్షకులు పూర్తిస్థాయిలో జష్టిఫికేషన్ పొందలేరు. క్లైమాక్స్ లో కూడా అతడు ఇచ్చే వివరణ అంతా నమ్మే విధంగా అనిపించదు.
ఈ సినిమాకు చాయ గ్రహణం అందించిన బాహుల్ రమేష్ కేరళ అందాలను అద్భుతంగా చూపించాడు. ఈ సినిమా ఈ స్థాయిలో ప్రేక్షకుల మన్నన పొందడానికి ప్రధాన కారణం అతడి ఫోటోగ్రఫీనే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. కొన్ని సన్నివేశాలలో ప్రేక్షకులు గగుర్పాటుకు గురవుతారు అంటే దానికి ప్రధాన కారణం ముజీబ్ మజీద్ అందించిన నేపద్య సంగీతం.
మొత్తం మీద ఎకో సినిమా అనేది మిస్టరీ థ్రిల్లర్. నెమ్మదిగా కాదా సాగుతున్నప్పటికీ.. ఆ తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను చూసేవారికి ఎకో అనేది అద్భుతమైన అనుభూతి అందిస్తుంది.