
‘ఏక్ మినీ కథ’ అనే ఓ బోల్డ్ సినిమా గురించి సోషల్ మీడియాలో బాగానే హడావుడి జరుగుతుంది. ‘డజ్ సైజ్ మేటర్స్’ అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక గోల్కొండ హై స్కూల్, పేపర్ బాయ్ లాంటి సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
పైగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. మరి అమేజాన్ ద్వారా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాలో ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథాకమామీషు :
సంతోష్ (సంతోష్ శోభన్)కి చిన్న తనం నుండే అతగాడికి తనది సైజ్ అనే ఫీలింగ్ బలంగా ఉంటుంది. దాంతో చదువు పై నుండి ఇంజనీరింగ్ వరకూ అదే బాధతో సతమతమవుతూ మొత్తానికి ఎలాగోలా పాసై ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. అయితే ఈ క్రమంలో అతగాడు తన సైజ్ ను పెద్దది చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏమిటి ? కాకపోతే ఏదీ సెట్ కాదు.
దీనికితోడు ఈ మధ్యలో ఇతగాడికి అమృత (కావ్య థాపర్)తో పెళ్లి కుదురుతుంది. తనవన్నీ బిగ్ డ్రీమ్సే. అన్నీ పెద్ద పెద్దవే కావాలని ఆశ పడుతుంది. కానీ అప్పటికే అమృత ప్రేమలో పడిపోయిన సంతోష్ పెళ్లి చేసుకుంటాడు. కానీ శోభనాన్ని మాత్రం పోస్ట్ ఫోన్ చేస్తూ తెగ కష్టపది పోతుంటాడు. మరి ఇతగాడి కాపురం ఎలా సాగింది ? అనేది మిగితా బాగోతం.
ప్లస్ పాయింట్స్ :
మెయిన్ పాయింట్, అలాగే కథ కూడా,
నేపథ్యం, పాత్రల పరిచయ సన్నివేశాలు.
మరియు పాత్రల చిత్రీకరణ,
కామెడీ సీన్స్
సహజమైన సన్నివేశాలు,
సంగీతం,
నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్ :
బోల్డ్ సీన్స్
స్లోగా సాగే కొన్ని సీన్స్.
ప్యాడింగ్ లేకపోవడం.
సినిమా చూడాలా ? వద్దా ? :
ఈ సినిమా పాయింటే కాస్త బోల్డ్ గా సాగుతుంది. కానీ, ఎక్కడా కామెడీ తగ్గకుండా జాగ్రత్త పడటంతో ప్రేక్షకులను ఈ సినిమా బాగానే అలరిస్తోంది. కరెంట్ ఎఫైర్స్ ని బాగా వాడుకుంటూ చిన్న చిన్న మాటల్లోనే సున్నితమైన హాస్యం పండిస్తూ దర్శకరచయితలు బాగా తెరకెక్కించారు. మొత్తానికి తెలుగు తెర పై ఇలాంటి సహజమైన బోల్డ్ చిత్రాన్ని తీయడం రిస్క్ అయినా, బాగానే హ్యాండిల్ చేశారు. ఈ లాక్ డౌన్ లో ప్రేక్షకులకు ఈ సినిమా గొప్ప రిలీఫ్ ను ఇస్తోంది.