
Deepika Padukone : ఆస్కార్ వేదికపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనే చేసిన ప్రజెంటేషన్ కు యావత్ ప్రపంచం ఫిదా అవుతుంది. ముఖ్యంగా భారతీయ నెటిజెన్లు ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ” ఒక నెల క్రితం కొంతమంది ఆమెను పఠాన్ చిత్రంలో నటించినందుకు బాయ్ కాట్ చేశారు. ఇప్పుడు ఆమె భారత్ కీర్తి ప్రతిష్టను ఇనుమడింపజేసింది. లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో విశ్వరూపం చూపించింది.” అని కొనియాడుతున్నారు. గతంలో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో వ్యాఖ్యాతల ఇంగ్లీష్ విని మా చెవుల నుంచి రక్తాలు కారేవి. కానీ దీపిక వల్ల ఆ బాధ తప్పిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రెడ్ కార్పెట్ ను మొత్తం తన భాష, యాసతో సుందరమయంగా మార్చిందని కితాబు ఇస్తున్నారు.
ఇక నాటు నాటు పాట గురించి దీపికా చెప్పినప్పుడు డాల్బీ థియేటర్ చప్పట్లతో మార్మోగింది.. దీపిక నాటు నాటు పాట గురించి చెబుతూ అది ఎలా ఉంది? సినిమాలో ఎక్కడ ఉంది? అన్న విషయాలను కూడా చెప్పారు..” పాట ముఖ్యమైన సన్నివేశంలో వచ్చింది. ఈ సినిమా స్నేహం ఆధారంగా, ముఖ్యంగా ఇద్దరు రియల్ లైఫ్ వ్యక్తులు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం మధ్య నడిచింది. పాటలు తెలుగులో పాడటమే కాకుండా, వలస వాద వ్యతిరేక ఉద్యమానికి నాందిగా ఇది ఉర్రూతలూగించింది. ఈ పాటకి మిలియన్స్ వ్యూస్ యూట్యూబ్, టిక్ టాక్, అలాగే ఈ పాటకి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేచి డ్యాన్స్ చేశారు. అలాగే ఇది మొదటి ఇండియన్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఆస్కార్ కి నామినేట్ అయిన మొదటి పాట” దీపిక చెప్పగానే హాల్ మొత్తం హోరెత్తిపోయింది. చప్పట్లతో మార్మోగింది.
ఆహుతులు చప్పట్లను ఆగకుండా కొడుతుండడంతో , మళ్లీ దీపిక తన ప్రసంగాన్ని ప్రారంభించింది..” నాటు అంటే మీకు తెలుసా?” అని అడిగింది. ” ఒకవేళ మీకు తెలియకపోతే, ఇప్పుడు తెలుసుకుంటారు” అంటూ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి “నాటు నాటు” పాట చూస్తూ వింటారు అన్నది దీపిక. దీంతో హాల్ హాలంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగడమే కాకుండా, అక్కడ ఒక తెలియని ఉద్వేగ భరితమైన వాతావరణం చోటుచేసుకుంది. దీపిక ప్రసంగాన్ని ప్రముఖ బిజినెస్ మాన్ ఆనంద్ మహీంద్రా ట్విట్ చేశారు. రాజమౌళికి తలవంచి వందనం చేస్తున్నా అని చెప్పారు.
This is Deepika Padukone, Pathan’s leading lady.
2 month ago she was boycotted in India for her movie, Today she represented india at #Oscar a global event gracefully and with a smile.
Boycott gang should be ashamed today pic.twitter.com/SSR8dvg0Vs
— Dr Nimo Yadav 2.0 (@DrNimoYadav) March 13, 2023