https://oktelugu.com/

Radhe Shyam Movie: ప్రభాస్ ‘ రాధే శ్యామ్ ” మూవీ నుంచి… ఈ రాతలే సాంగ్ ప్రోమో ఔట్

Radhe Shyam Movie: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి … రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రభాస్ అబిమానులకు గిఫ్ట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 15, 2021 / 04:23 PM IST
    Follow us on

    Radhe Shyam Movie: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి … రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రభాస్ అబిమానులకు గిఫ్ట్ గా ఇచ్చింది.

    కాగా ఇటీవల ఈ సినిమా లోని “ఈ రాతలే” అనే లిరికల్ సాంగ్​​ వీడియోను నవంబరు 15 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్​ను కూడా విడుదల చేశారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ పాట ప్రోమోను మూవీ ఉన్ ఐ‌టి విడుదల చేసింది. ఈ ప్రోమోలో పూజా హెగ్డే చేతిని ప్రభాస్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉంది. దీంతో ఈ సాంగ్ పై అంకణాలు మరింత పెరిగాయి. కాగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు పూర్తి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై వంశీ – ప్రమోద్ – ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్‌ ” లో కూడా నటిస్తున్నాడు. అలానే ఓం రావత్ డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. దీని తర్వాత నాగ్‌ అశ్విన్‌ ” ప్రాజెక్టు కె “, సందీప్ రెడ్డి వంగా ” స్పిరిట్ ” చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.