Comedy Stars Promo: కామెడీ షోల పుణ్యమా అంటూ ఈ మధ్య బుల్లితెర ఎంటర్టైన్మెంట్ అనే పదానికి కేరాఫ్ అడ్రెస్స్ గా మారింది… అంతేకాకుండా డబుల్ మీనింగ్ డైలాగ్‌లకు కూడా పరాకాష్టగా మారింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, రీసెంట్‌గా మొదలైన కామెడీ స్టార్స్ ఇలా ఏ కార్యక్రమం చూసుకున్నా వినోదం సంగతి పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి చూడాలంటేనే భయపడేట్టుగా మారింది.
ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు ఈటీవీలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కామెడీ షో వస్తుండగా… దానికి ధీటుగా స్టార్ మా ఛానల్‌లో 1.30 గంటలకు కమెడీ స్టార్స్ అనే కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుంటే యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తోంది.
ఇదిలా ఉంటే ఈటీవీ ప్లస్ లో రవి, శ్రీ ముఖి యాంకర్లుగా వ్యవహరించిన పటాస్ అనే కామెడీ షో ద్వారా పరిచయమయ్యాడు ఎక్సప్రెస్ హరి. ఆ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక అనూహ్యం గా ఆ కార్యక్రమం నుండి వైతొలిగాడు. అడపా దడపా జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో లలో కనిపించేవాడు. ఆ తర్వాత జీ తెలుగు లో ప్రసారమయిన అదిరింది షో లో కొంతకాలం స్కిట్లు చేసి అందరిని అలరించాడు. ఈ కార్యక్రమానికి నాగబాబు, నవదీప్ జడ్జి గా వ్యవహరించగా యాంకర్లుగా రవి, భాను వ్యవహరించారు.
ఆ తర్వాత స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న కమెడీ స్టార్స్ అనే కార్యక్రమం లో కనిపిస్తూ అందరిని కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్, శ్రీదేవి విజయ్ కుమార్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తుంటే యాంకర్ గా శ్రీముఖి వ్యవహరిస్తోంది. అయితే తాజా గా విడుదల చేసిన స్టార్ కమెడియన్స్ ప్రోమోలో ఈ మధ్యే రిలీజ్ అయిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకి స్టెప్పులు వేస్తూ కనిపించాడు ఎక్సప్రెస్ హరి.