Bandi Sanjay: రాష్ట్రంలో పొలిటికల్ వేడి మరింత పెరిగనుంది. వడ్ల కొనుగోలు విషయంలో ప్రారంభమైన ఈ హీట్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించడంతో టీఆర్ఎస్ ఈ వార్‌ను స్టార్ట్ చేసింది. రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనబోనని చెబుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోందంటూ ఆరోపిస్తోంది. దీనిని రాష్ట్ర బీజేపీ శ్రేణులు తిప్పి కొడుతున్నారు. ఇందులో భాగంగానే రెండు పార్టీలు ఇటీవల ఆందోళనలు నిర్వహించాయి. వడ్ల కొనుగోలు విషయంలో తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు..

రైతులను నేరుగా కలవనున్న బండి..
వడ్ల కొనుగోలు విషయంలో రెండు పార్టీలు భిన్న వైఖరులను ప్రదర్శిస్తున్నాయి. తాము మాత్రమే రైతుల బాగు కోసం కృషి చేస్తున్నామంటూ రెండు పార్టీలు చెప్పుకుంటున్నాయి. కానీ యాసంగి పంట కొనుగోలు విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ విషయంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే వడ్ల కొనుగోలు విషయంలో తమ తప్పేమీ లేదని బీజేపీ చెబుతోంది. ఈ సందర్భాన్ని తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఉపయోగించుకోబోతోంది. అందులో భాగంగానే బండి సంజయ్ మరో యాత్రకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు తిరిగి రైతులను కలవాలని నిర్ణయించుకున్నారు. మొదట నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.
వరి రైతుల పట్ల టీఆర్ఎస్ సర్కారు తీరును ఎండగట్టేందుకు ఈ యాత్ర చేస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. వానాకాలం వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్లు, ఇతర కొనుగోలు కేంద్రాలను బండి సంజయ్ పరిశీలించనున్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గర నుంచి పరిశీలించనున్నారు.
Also Read: కేసీఆర్, బండి డిష్యుం డిష్యుం వెనుక…
ఈ యాత్రతో బీజేపీకి లాభమే..
హుజూరాబాద్ ఫలితం తరువాత జోష్‌లో ఉన్న ఆ పార్టీ నాయకులకు ఈ యాత్ర మరింత కలిసి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు ఈ యాత్రను ఉపయోగించుకోనుంది. నిజానికి హుజూరాబాద్ ఎన్నికలు అయిపోయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ వద్ద సరైన అంశాలు లేవు. కానీ టీఆర్ఎస్సే ఆ పార్టీకి అవకాశం ఇచ్చినట్లయ్యింది. వడ్ల కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ నాయకులు
Also Read: వడ్ల చుట్టే రాజకీయం.. రైతులతో ఇరు పార్టీల చెలగాటం..
బీజేపీని బూచీగా ప్రయత్నం చేశారు. కానీ అదే ఇప్పుడు వారికి అనుకూలంగా మారనుంది. బీజేపీ గురించి ప్రజలు మాట్లాడుకునే అవకాశం వచ్చింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకులు సేఫ్ జోన్‌లో ఉన్నట్లయ్యింది. ఇప్పుడు ఈ యాత్ర వారికి మరింత కలిసిరానుంది.