ED Seized 5 Crore: ఒకప్పుడు మన దేశంలో అక్రమాలు అంతగా జరిగేవి కావు. ప్రజా ప్రతినిధులు అడ్డగోలుగా దోచుకునేవారు కాదు. అధికారులు కూడా కొంతలో కొంత కక్కుర్తి పడితే పడేవారు .. అడ్డగోలుగా సంపాదిద్దామని.. జనాల అనుకునేవారు కాదు.. పైగా అప్పట్లో వ్యవస్థ అంటే చాలామందికి భయం ఉండేది. తప్పు చేయాలంటే ఒక రకమైన ఇబ్బంది వారిలో కనిపించేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు..
మనదేశంలో బోఫోర్స్ కుంభకోణం అప్పట్లో సంచలనం సృష్టించింది. కోట్ల విలువైన ఆ కుంభకోణం మన దేశ ఆర్థిక పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. కానీ ఇప్పుడు లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా సరే పెద్దగా జనాలలో పట్టింపు ఉండడం లేదు. ప్రభుత్వాలు కూడా పెద్దగా చర్యలు తీసుకోవడం లేదు. పైగా వ్యవస్థలో ఉన్న లోపాలు అక్రమార్కులకు వరాలుగా మారుతున్నాయి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, మధ్యవర్తులు ఇష్టానుసారంగా సంపాదిస్తున్నారు. వందలు, వేల కోట్లకు ఎదుగుతున్నారు. సామాన్య ప్రజలు మాత్రం ఓటు వేయడానికి పనికి వచ్చే యంత్రాలుగానే మిగిలిపోతున్నారు. అయితే కొన్ని సందర్భాలలో మన వ్యవస్థలు పటిష్టంగా పనిచేయడం వల్ల దుర్మార్గాలకు పాల్పడే వ్యక్తుల అసలు బాగోతాలు బయటపడుతున్నాయి.
రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కాదు.. మధ్యవర్తులుగా వ్యవహరించే వారు కూడా బీభత్సంగా సంపాదిస్తున్నారు. అలా ఓ మధ్యవర్తి దండిగా సంపాదించాడు. అతని వ్యవహారంపై కొద్ది రోజులుగా enforcement directorate దృష్టి సారించింది. కీలకమైన ఆధారాలను సేకరించింది. ఆ తర్వాత రంగంలోకి దిగింది.
పలు ప్రభుత్వ కార్యాలయంలో మధ్యవర్తిగా ఉండే ఇంద్రజిత్ సింగ్ యాదవ్ పై enforcement directorate మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో కీలకమైన ఆధారాలు సంబంధించిన తర్వాత అతని ఇంట్లో దాడులు చేసింది. ఢిల్లీలో ఉన్న అతడి నివాసంలో సోదాలు జరిపింది enforcement directorate.. సోదాలలో భాగంగా అతడి ఇంట్లో 8.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు లభించాయి. తర్వాత గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. వాటిని లెక్కిస్తే మొత్తం ఐదు కోట్ల వరకు నగదు లభ్యమైంది. ఇది మాత్రమే కాకుండా 35 కోట్ల ఆస్తి పత్రాలు కూడా అధికారులకు లభించాయి.
హర్యానా రాష్ట్రానికి చెందిన ఇంద్రజిత్ సెటిల్మెంట్లు చేస్తుంటాడు.. ప్రభుత్వ కార్యాలయాలలో మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటాడు. ప్రత్యేకమైన ముఠాను ఏర్పాటు చేసుకొని బెదిరింపులకు కూడా పాల్పడుతుంటాడు. అనేక కేసులలో ఇతడు నిందితుడు. ఈ నేపథ్యంలో కేసులు నమోదు కావడంతో అతడు ఇటీవల యూఏఈ వెళ్లిపోయాడు. అతడు అక్కడ ఉన్నప్పటికీ కోర్టు ద్వారా అనుమతులు తీసుకుని.. enforcement directorate అధికారులు దాడులు చేశారు. అతడి చీకటి బాగోతాన్ని ఇలా బయటపెట్టారు.