Homeఎంటర్టైన్మెంట్Tollywood Drugs case: టాలీవుడ్ మీద మ‌ళ్లీ దండ‌యాత్ర చేయ‌బోతున్న ఈడీ.. రేవంత్ రూపంలో క‌థ...

Tollywood Drugs case: టాలీవుడ్ మీద మ‌ళ్లీ దండ‌యాత్ర చేయ‌బోతున్న ఈడీ.. రేవంత్ రూపంలో క‌థ మొద‌టికి..!

Tollywood Drugs case: టాలీవుడ్‌ను ఉలిక్కి ప‌డేలా చేసిన డ్ర‌గ్స్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందుకు సంబంధించి ఏదో ఒక వార్త వైర‌ల్ అవుతూనే ఉంది. ఏ క్ష‌ణంలో ఎవ‌రి మీద పిడుగు ప‌డుతుందో అన్న‌ట్టు టాలీవుడ్ లో సెల‌బ్రిటీలు ఇంకా భ‌యంతోనే ఉన్నారు. కాగా ఆ మ‌ధ్య‌లో ఈడీ అంద‌రికీ క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో అంతా హ‌మ్మ‌య్యా అనుకున్నారు. కానీ ఇంత‌లోనే రేవంత్ రెడ్డి రూపంలో అంద‌రినీ షాక్ త‌గిలింది. ఆయ‌న హై కోర్టులో ఈ విష‌యం మీద పిటిష‌న్ వేశారు.

Tollywood Drugs case
Tollywood Drugs case

ఎక్సైజ్ శాఖ స‌రిగ్గా స్పందించ‌లేద‌ని, ఈడీకి స‌హ‌క‌రించ‌లేద‌ని ఆయ‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఈడీకి కేవ‌లం ఎఫ్ ఐఆర్ మాత్ర‌మే ఇచ్చార‌ని, డిజిట‌ల్ ఆధారాలు కూడా ఇవ్వాలంటూ కోర‌డంతో.. హైకోర్టు వెంట‌నే ఈడీకి డిజిట‌ల్ ఆధారాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. దీంతో ఊపిరి పీల్చుకుంటున్న టాలీవుడ్‌కు గుండెల్లో పిడుగు ప‌డ్డ‌ట్టు అయింది.

ఇంకా ఈ కేసులో హైకోర్టు మ‌రిన్ని ఆదేశాలు జారీ చేసే అవ‌కాశం కూడా ఉంది. పైగా కొత్త‌గా వ‌చ్చిన హైద‌రాబాద్ సీపీ ఆనంద్ వ‌స్తూనే టోనీ అనే డ్ర‌గ్స్ స్మగ్లర్ ను అరెస్ట్ చేశారు. ఈ టోనీకి, అలాగే కెల్విన్‌కు సంబంధాలు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే పోలీసుల‌కు ఆధారాలు కూడా ల‌భించిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసు మొత్తం కాల్ లిస్టు చుట్టే తిరుగుతోంది. వీరిద్ద‌రి కాల్ లిస్టును ప‌రిశీలించి టాలీవుడ్ లో ఎవ‌రికైనా లింకులు ఉన్నాయోమో ప‌రిశీలిస్తారు.

అయితే ర‌వితేజ త‌మ్ముడు అప్ప‌ట్లో మ‌ర‌ణించ‌డంతో.. అత‌ని సెల్ ఫోన్ లో ఉన్న కాల్ లిస్టు ఆధారంగా చాలామందిని అరెస్ట్ చేశారు. ఇక మ‌రెవ‌రికి లింకులు ఉన్నాయో డిజిట‌ల్ ఆధారాల‌ను ప‌రిశీలిస్తే తెలిసే అవకాశం ఉంది. దీంతో మ‌ళ్లీ టాలీవుడ్ మీద ఈడీ దండ‌యాత్ర చేసే అవ‌కాశం కూడా ఉంది. ముగిసిపోయిన అంశం ఇప్పుడు టాలీవుడ్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

Revanth Reddy
Revanth Reddy

కాగా త్వ‌ర‌లోనే ఈ అంశం హాట్ టాపిక్ అయ్యే అవ‌కాశం కూడా ఉంది. డిజిట‌ల్ ఆధారాల్లో ఎవ‌రైనా టాలీవుడ్ సెల‌బ్రిటీల‌కు లింకులు ఉన్న‌ట్టు తేలితే మాత్రం మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌స్తుంది. ముగిసిపోయింద‌నుకున్న కేసు రేవంత్ రూపంలో ఇలా చుట్టేసింద‌న్న మాట‌.

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Sarkaru Vaari Paata: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా అప్‌ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. […]

Comments are closed.

Exit mobile version